Breaking News

Daily Archives: November 20, 2015

ఖానాపూర్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల స్థల పరిశీలన

  ఆర్మూర్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిస్టాత్మకంగా తీసుకున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కు సంబంధించిన 5.18 ఎకరాల భూమిని ఆర్డీవోయాదిరెడ్డి శుక్రవారం ఖానాపూర్‌లో పరిశీలించారు. ఆయన వెంట ఎంపిటిసి, గ్రామ సర్పంచ్‌, తహసీల్దార్‌ శ్రీధర్‌, ఆర్‌ఐ రవిందర్‌లు ఉన్నారు.

Read More »

రాయితీ రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

  ఆర్మూర్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన యువతీ, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆర్మూర్‌ ఎంపిడివో లింగయ్య శుక్రవారం తెలిపారు. రాయితీ రుణాల కోసం దరఖాస్తులు చేయదలచే అన్ని వర్గాల వారు 21 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల మధ్య వయసువారై ఉండాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ కేటగిరికి చెందిన వారైతే 20 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారు ...

Read More »

నీటి సమస్యపై ప్రత్యేక సమావేశం

  ఆర్మూర్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని నీటి సమస్య పరిష్కరించేందుకు ఆర్మూర్‌ మునిసిపాలిటీలో శుక్రవారం ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అద్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలోని 23 వార్డుల్లో నీటి సమస్యల ఎక్కువగా ఉందో తెలుసుకొని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

Read More »

ఆర్టీసి కార్మికుల మెరుపు సమ్మె

  ఆర్మూర్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఆర్టీసి డిపో కార్మికులు శుక్రవారం మెరుపు సమ్మె చేపట్టారు. ఆర్టీసి డిపోలోని బస్సులను, సిబ్బందిని ఇతర డిపోలకు తరలిస్తుండడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం డిపోకు చెందిన బస్సులన్ని నిలిచిపోయాయి. దశల వారిగా బస్సులను ఎత్తివేసి యాజమాన్యం డిపోను తరలించే ఆలోచనలో ఉన్నందున దాన్ని అడ్డుకోవడానికి సమ్మె చేస్తున్నట్టుకార్మికులు తెలిపారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే అన్ని పార్టీల మద్దతుతో ఆందోళన ఉదృతం చేస్తామని కార్మికులు ...

Read More »

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

  ఆర్మూర్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జమాతె ఉలామాయె హింద్‌ఆర్మూర్‌ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం 12 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.

Read More »

న్యాయ కళాశాలలో కంప్యూటర్‌ శిక్షణా తరగతులు ప్రారంభం

  డిచ్‌పల్లి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ న్యాయకళాశాలలో న్యాయశాస్త్ర విద్యార్తులకు కంప్యూటర్‌లో శిక్షణా తరగతులు శుక్రవారం న్యాయకళాశాల ప్రధానాచార్యులు డాక్టర్‌ జట్లింగ్‌ ఎలోసా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో కంప్యూటర్‌ విజ్ఞానం తప్పని సరని దానిపై అవగాహన లేకుండా ఉంటే ఎన్ని ఉన్నత చదువులు చదివినా వ్యర్థమేనని, ప్రతి రంగంలో కంప్యూటర్‌ ప్రాధాన్యత పెరిగిపోయిందని వివరించారు. కంప్యూటర్‌ తరగతులు న్యాయ విద్యార్తులకు ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు. కార్యక్రమంలో వినూత్నంగా న్యాయశాస్త్ర విద్యార్థులే ...

Read More »

బయోటెక్నాలజి అభ్యర్థులకు నేడు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రఖ్యాత బయోటెక్నాలజి సంస్థ బయోలాజికల్‌ ఇనాక్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థ బయోటెక్నాలజి విద్యార్థులకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ నిర్వహించడానికి నవంబర్‌ 21వ తేదీ శనివారం తెలంగాణ యూనివర్సిటీకి విచ్చేస్తున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బయోటెక్నాలజి చదువుతున్న విద్యార్థులకు 2015 అకడమిక్‌ సంవత్సరంలో బయోటెక్నాలజి పాస్‌ అయిన విద్యార్థులు ఈ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో పాల్గొనడానికి అర్హులని బయోటెక్నాలజి విభాగం అధిపతి డాక్టర్‌ మామిడాల ప్రవీణ్‌ అన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో ...

Read More »

వ్యక్తి అదృశ్యం

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని బడా కసాబ్‌ గల్లికి చెందిన ఎం.డి.పజుల్‌ రహమాన్‌ (48) కనిపించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్క్రాబ్‌ దుకాణంలో పనిచేస్తున్న రహమాన్‌ ఈనెల 15న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీసులకు తెలియజేయాలని ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు వివరించారు.

Read More »

అనుమతిలేని కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుమతిలేని కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి డిప్యూటి డిఇవో కార్యాలయంలో శుక్రవారం ఏబివిపి నాయకులు వినతి పత్రం అందజేశారు. డిప్యూటి డిఇఓ లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా ఏబివిపి నగర కార్యదర్శి బాల్‌రాజు మాట్లాడుతూ కామారెడ్డిలోని ప్రణతి కోచింగ్‌ సెంటర్‌లో అనుమతి లేకుండా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. కనీస మౌలిక వసతులు సైతం లేవని, 60 ...

Read More »

లారీ సర్వీస్‌ బాడీ వర్క్‌షాపు దగ్దం

  – రూ. 6 లక్షల ఆస్తి నష్టం కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని జాతీయ రహదారి పక్కనేగల శ్రీరామాంజనేయ లారీ సర్వీస్‌ బాడీ వర్క్‌షాపు ప్రమాదవశాత్తు దగ్దమైంది. గురువారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సంభవించిన అగ్నిప్రమాదంలో వర్క్‌షాప్‌ కాలిపోయింది. వర్క్‌షాప్‌లోని వెల్డింగ్‌ మిషన్‌, కేబుల్‌, గ్యాస్‌ కట్టర్‌, పైపులు, గ్యాస్‌వెల్డింగ్‌, గ్యాస్‌ పైపులు, సిలిండర్‌, కార్బ్‌ ట్యాంకు, గ్రైండింగ్‌, డ్రిల్లింగ్‌ మిషన్లు, అల్యూమినియం షీట్లు, రేకులతోపాటు విలువైన సామాగ్రి కాలిపోయిందని బాధితుడు రాములు ...

Read More »

కుట్టు మిషన్ల వితరణ

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ వివేకానంద కామారెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం తెలంగాణ మహిళా సంఘానికి ఉచితంగా కుట్టుమిషన్లు పంపినీ చేశారు. ఈ సందర్బంగా క్లబ్‌ అధ్యక్షుడు శంకర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వారికి చేయూత నివ్వడంలో భాగంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశామన్నారు. తెలంగాణ మహిళా సంఘానికి భవిష్యత్తులో సైతం తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు ప్రవీణ్‌, హరిధర్‌, శ్రీనివాస్‌, రాజేందర్‌, మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, ట్రైనర్లు ...

Read More »

ప్రగతి పనులు ప్రారంభం

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 5వ వార్డు సైలాన్‌బాబా కాలనీలో శుక్రవారం రూ. 10 లక్షలతో చేపడుతున్న మురికి కాలువ నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్‌ ప్లాట్లను క్రమబద్దీకరించుకోవడం ద్వారా చట్టబద్దమైన యాజమాన్య హక్కులను పొందవచ్చన్నారు. బిల్డింగ్‌, లేఅవుట్‌లు, ప్లాట్లు రెగ్యులరైజేషన్‌ చేసుకోని వారిపై పురపాలిక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిర్ణీత గడువులోగా అక్రమ ...

Read More »

తెవివిలో స్వచ్చభారత్‌

  డిచ్‌పల్లి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాలలో స్వచ్చభారత్‌ కార్యక్రమం ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-2 ఆద్వర్యంలో గురువారం నిర్వహించారు. కళాశాల లోపలి ప్రాంగణంలో పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌ వాలంటీర్లు పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి వీలయ్యే విధంగా ఈ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ మాట్లాడుతూ వాలంటీర్లకు సామాజిక అభివృద్దికి తోడ్పడే అవకాశం వినియోగించుకున్నందుకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో భావి భారత ...

Read More »

చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి

  నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు చదువులకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో బాలల చలన చిత్రోత్సవాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని దేవి థియేటర్‌ను సందర్శించి మాట్లాడుతూ ఈ థియేటర్‌లో 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో భాగంగా నవంబర్‌ 14 నుంచి 20వ తేదీ వరకు సుమారు 16 వేల మంది బాల బాలికలకు రోజు మూడు షోలు ఉదయం 10 ...

Read More »

నిజామాబాద్‌ అర్బన్‌కు 1500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

  నిజామాబాద్‌ రూరల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌కు ప్రభుత్వం 1500 రెండు పడకల గదుల ఇళ్లను మంజూరు చేసినట్టు ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇన్‌చార్జి కలెక్టరు చాంబరులో మాట్లాడుతూ నిజామాబాద్‌ అర్బన్‌కు గతంలో 400 రెండు పడకల గదుల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిన వాటిని అదనంగా మరో 1100 లు రెండు పడకల గదులను మంజూరు చేసిందని, వాటిని నిర్మించనున్నట్టు ఆయన వివరించారు.

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  డిచ్‌పల్లి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామంలో సర్పంచ్‌ లావణ్య సిసి రోడ్డు పనులను గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్సీ నిధుల కింద 2.50 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులు ప్రారంభం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Read More »

అక్రమంగా ఇసుక రవాణా

  మెదక్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ ఇసుక ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం రామాయంపేటలో ఏకంగా 7 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకోవడం జరిగింది. రామాయంపేట మండలంలోని రాంపూర్‌ గ్రామ వాగు నుంచి రామాయంపేటకు అక్రమంగా తరలిస్తున్న 7 ఇసుక ట్రాక్టర్లను రామాయంపేట పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాలు పట్టుకున్నట్టు ఏఎస్‌ఐ బేతప్ప అన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను మైనింగ్‌, రెవెన్యూ అదికారులకు అప్పగించామన్నారు. మండలంలో ఎవరైనా ఎక్కడైనా ...

Read More »

పించన్ల కోసం పడిగాపులు

  నందిపేట్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని సబ్‌ పోస్టాఫీసులో ప్రతినెల వృద్దులు, వికలాంగులకు, బీడీ కార్మికులకు ఇచ్చే పింఛన్లు పోస్టాఫీసు వద్ద పంపిణీ చేయడం జరుగుతుంది. నవంబర్‌ నెలకు సంబంధించిన పించన్లు గత రెండ్రోజులుగా పంపిణీ చేస్తున్నారు. కానీ పింఛను దారులకు ఎలాంటి వసతులు లేకపోవడంతో ఎండలోనే క్యూలో నిలబడుతున్నారు. వృద్దులు ఎండలో నిలబడి అనారోగ్యానికి గురవుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం తాగునీరు కూడా సమకూర్చడం లేదని వాపోయారు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ...

Read More »

నిజామాబాదు జిల్లా చరిత్ర

జిల్లా పేరు వెనుక చరిత్ర నిజామాబాదును 8వ శతాబ్దములో రాష్ట్రకూట వంశానికి చెందిన ఇంద్రవల్లభ పాంత్యవర్ష ఇంద్ర సోముడనే రాజు పరిపాలించాడు. అతని పేరుపైననే ఈ ప్రాంతానికి ఇందూరు అని పేరు వచ్చినది. ఇందూరుకు పూర్వం పేరు ఇంద్రపురి. ఇంద్రపురి అని ఒక రాజు పేరు మీదుగా పేరు వచ్చిందని భావించబడుతున్నది. కానీ ఆ రాజు క్రీ.శ.388 ప్రాంతంలో నర్మదా, తపతిల దక్షిణ ప్రాంతాన్ని పాలించిన త్రికూటక వంశానికి చెందిన ఇంద్రదత్తుడా, విష్ణుకుండిన చక్రవర్తి మొదటి ఇంద్రవర్మనా ఇదమిద్ధంగా తెలియడం లేదు. 20వ శతాబ్దం ...

Read More »

కుమారి 21 ఎఫ్‌ రివ్యూ

చూపించాల్సిందంతా చూపించేసి – `బ్బాబ్బాబూ… ఇంత వ‌ర‌కూ మీరు చూసిందంతా త‌ప్పు.. అలా ఉండ‌కూడ‌దు..` అని చివ‌రి రీలులో జ్ఞానోద‌యం చేసే సినిమాలు ఇది వ‌ర‌కు చాలా వ‌చ్చాయి. అంటే 13 రీళ్ల బూతు.. చివ‌ర్లో ఒక‌రీలు నీత‌న్న‌మాట‌. ఇలాంటి సినిమాల్ని జనం ఎంత తిట్టుకొన్నా… యూత్ థియేట‌ర్ల‌కు వెళ్లి క‌న‌క‌వ‌ర్షం కురిపించుకొన్నాయి. అలా యూత్‌ని టార్గెట్ చేస్తూ.. సుకుమార్ చేసిన ప్ర‌య‌త్నం ‘కుమారి 21 ఎఫ్‌’. సుకుమార్ కాబ‌ట్టి బూతుని నీట్ గా ప్యాక్ చేసి ‘మెచ్యూరిటీ’ అనే ముసుగు వేసి అందించే ...

Read More »