Breaking News

Daily Archives: November 23, 2015

ఉద్దేశ్యపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టారు -ఎంపీ శ్రీమతి కవిత

జాగృతి అధ్యక్షులు, నిజామాబాద్‌ ఎంపీ శ్రీమతి కవిత గారి పై ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. దానికి సంబందించి ఆంధ్రజ్యోతి ఉద్దేశ్యపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టారని ఒక ప్రకతననలో తెలిపారు. వారి ప్రకటన యథాతథం:   తేదీ. 13 జూన్ 2014 నాడు శ్రీమతి కవిత ఎన్నికల మొత్తం ఖర్చు రూ. 22,39,845 కు సంబంధించిన పూర్తి లెక్కలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగింది. తేదీ: 16 జూన్ 2014 న జిలా ఎన్నికల అధికారి తమ అంచనా ప్రకారం మొత్తం ఖర్చు రూ. 53,97,246 ...

Read More »

కార్తిక ద్వాదశి నేడు

కార్తీక శుక్ల ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అంటారు. ఈ ఉత్థాన ద్వాదశినాడు తులసి మొక్కకి కల్యాణం చేస్తారు. ఉత్థాన ద్వాదశినాడు తులసి, విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణుస్వరూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసితో కల్యాణం జరిపిస్తారు. కొందరు కార్తిక శుక్ల ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద, ఉసిరి మొక్కలను నాటుతారు. పురాణ కథనాన్ని అనుసరించి, తులసి కల్యాణం కథ ఇలా సాగుతుంది. దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మధించినప్పుడు ...

Read More »

24వ వార్డుపై వివక్ష వీడి నిదులు కేటాయించాలి

  కామారెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 24వ వార్డుపై అధికారులు వివక్ష చూపుతున్నారని వివక్ష వీడి నిదులు కేటాయించాలని వార్డు కౌన్సిలర్‌ రేణుక, సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌లు సోమవారం మునిసిపల్‌ ఇన్‌చార్జి కమీషనర్‌ పఠాభికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డు పెద్ద వార్డుగా ఉందన్నారు. వార్డులో జనరల్‌ ఫండ్‌ను తొలగించడం వివక్ష కాకపోతే ఏంటని ప్రశ్నించారు. వార్డును అధికారులు పాలకవర్గం పక్షపాతంగా చూస్తోందని పేర్కొన్నారు. ఎస్సీ, ...

Read More »

బైండ్ల జేఏసి జిల్లా సదస్సును విజయవంతం చేయాలి

  కామారెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలో త్వరలో నిర్వహించనున్న బైండ్ల జేఏసి జిల్లా సదస్సును విజయవంతం చేయాలని బైండ్ల జేఏసి జిల్లా ఛైర్మన్‌ పోతరాజు స్వామి కోరారు. సోమవారం కామరెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఏసి జిల్లా సదస్సుకు అన్ని జిల్లాల్లో ఉన్న బైండ్ల, పోతరాజు, దేవత కొలుపుల, ఆసాది కులాలవారందరు భారీ ఎత్తున హాజరు కావాలని కోరారు. బైండ్ల కులస్తుల ఐకమత్యాన్ని చాటి హక్కుల సాదన కోసం ఉద్యమించాలన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా బైండ్ల ...

Read More »

సహ చట్టం రామబాణంలా పనిచేస్తుంది

  కామారెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాచార హక్కుచట్టం రామబాణంలా పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి ఇది వజ్రాయుధం లాంటిదని కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎం.ఎ.సలీం అన్నారు. కామరెడ్డి పట్టణంలోని వశిష్ట డిగ్రీ, పిజి కళాశాలలో సోమవారం సమాచార హక్కుచట్టం – 2005కు సంబంధించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని సూచించారు. సమాచార హక్కుచట్టం పరిధిలోని న్యాయ ...

Read More »

ఎన్‌జివోస్‌ సహకార గృహ నిర్మాణసంఘం కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఎన్‌జివోస్‌ సహకార గృహ నిర్మాణ సంఘం కామారెడ్డి నూతన కార్యవర్గ సభ్యులను సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిప్యూటి రిజిస్ట్రార్‌ కృష్ణయ్య నేతృత్వంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షునిగా భూమయ్య, ఉపాధ్యక్షునిగా పాండురంగ శర్మ, కార్యదర్శిగా మనోహర్‌రావు, కోశాధికారిగా శ్రీకాంత్‌రెడ్డి, డైరెక్టర్లుగా నాగభూషణం, రాజిరెడ్డి, వెంకటేశం, గంగాప్రసాద్‌, డివి.ఎల్‌.ఎస్‌.శర్మలు ఎన్నికయ్యారు.

Read More »

ప్రజావాణిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

  రెంజల్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి పలుశాఖల అదికారులు పాల్గొని ప్రజా సమస్యలు స్వీకరించాలని, నేరుగా పరిష్కారమార్గం ప్రజావాణిలో ఉందని ప్రతి ఒక్కరు సద్వినియోగంచేసుకోవాలని తహసీల్దార్‌ వెంకటయ్య సూచించారు. సోమవారం వెలువడ్డ వినతులను వారంలోగా పరిష్కారమయ్యేవిధంగా చూస్తామని అన్నారు.

Read More »

ఎంపిడివోతో మొరపెట్టుకున్న ఇంకుడుగుంతల లబ్దిదారులు

  రెంజల్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పలుమార్లు ప్రజల దృస్టికి తీసుకొచ్చి నిర్మించుకోవాలని సూచించినా కూడా నిర్మించుకున్న లబ్దిదారులకు మాత్రం నేటికి బిల్లులు అందలేకపోవడంతో మండలంలోని బాగేపల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులు సోమవారం మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చి ఎంపిడిఓతో మొరపెట్టుకున్నారు. తాము ఇంకుడు గుంతలు నిర్మించుకొని నెలలు గడుస్తున్నా కూడా నేటికి డబ్బులు రాకపోవడంతో తమరికి విన్నవిచేందుకు వచ్చామని చెప్పారు. తమ డబ్బులు త్వరలో ఇప్పించాలని ఎంపిడివోతో అన్నారు. ఎంపిడివో ...

Read More »

బడిబయటి పిల్లలను గుర్తించండి

  – ఎంఇవో గోపాల్‌రావు బీర్కూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గల బడిబయటి పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని ఎంఇవో గోపాల్‌రావు అన్నారు. మండల కేంద్రంలోగల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాద్యాయుల సమావేశంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలో, గ్రామాల్లో గల 14 సంవత్సరాలలోపు బాల కార్మికులు, బడిబయటి పిల్లలు, అనాథలు, మతిస్థిమితంలేనివారిని గుర్తించి నివేదికలు తయారుచేయాలన్నారు. అనాథలకు డిచ్‌పల్లి మండలం ధర్మారం వద్ద వసతి ...

Read More »

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

  ఎంపిడివో భరత్‌కుమార్‌ బీర్కూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృస్ట్యా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, మండలంలోని ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కృసి చేస్తామని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో సోమవారం ఆయన సందర్శించారు. గ్రామంలో తాగునీటి బోర్లు ఎత్తేశాయని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు బోర్లను పరిశీలించారు. మరమ్మతులు చేయించి తాగునీటి సమస్యఅ ధిగమిస్తామన్నారు. అంతేగాకుండా వ్యవసాయ బోర్లనుంచి నీటిని తీసుకొని మంచినీటి ట్యాంకులకు అనుసంధానం చేసి ...

Read More »

నిప్పుల కుంపటిపై నేపాల్

నేపాల్ నూతన రాజ్యాంగం సృష్టించిన సంక్షోభం మరో ముగ్గురిని బలికొనింది. నేపాలీ పోలీసులు సోమవారం జరిపిన కాల్పుల్లో బిహార్ నుండి నేపాల్‌కు వెళ్లిన ఒక యువకుడు కూడ మరణించడం మిక్కిలి దురదృష్టకరమైన పరిణామం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మాధేశీ నిరసన బృందాలపై పోలీసులు కాల్పులు జరపడం ఊహించని పరిణామం. మాధేశీలతోను, తెరాయ్ ప్రాంతంలోని ఇతర జనసముదాయాలతోను రాజ్యాంగ సవరణను గురించి చర్చలు జరుపనున్నట్టు ఇన్ని రోజులుగా ప్రకటించిన నేపాల్ ప్రభుత్వం ఇప్పుడిలా దమనకాండకు పాల్పడడం పట్ల మన ప్రభుత్వం కూడ నిరసన తెలుపుతోంది. ప్రధానంగా ...

Read More »