Breaking News

Daily Archives: November 27, 2015

can we get aids from blood transfusion of HIV negative? ,హెచ్.ఐ.వి లేని డోనార్ నుండి ఎయిడ్స్ ఎలా?

ప్ర : నా భార్యకి కాన్పు  సమయము లో అధికము గా రక్తస్రావము అయినది , అత్యవసరముగా రక్తం ఎక్కించారు . రక్తము ఎక్కించేముందు ఆ రక్తాన్ని ఎయిడ్స్ తో సహా అన్ని పరీక్షలూ చేసారు. అయినప్పటికీ ఆవిడకు ఎయిడ్స్ వచ్చింది. ఇది ఎలా సాధ్యము ? మా అవిడ శీలాన్ని శంకించలేను. నేను కూడా ఫర్ ఫెక్ట్ . అటువంటప్పుడు ఇదెలా జరిగింది?. జ : మామూలు రక్త పరీక్షల్లో హెచ్.ఐ.వి ఉన్నట్లు తెలియడానికి మూడు నెలలు పడుతుంది. ఎవరైనా హెచ్ ఐ.వి ...

Read More »

నేడు బ్యాంకుల ఎదుట సిపిఎం ధర్నా

  కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు బ్యాంకులు రుణాలివ్వకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 28 శనివారం బ్యాంకుల ఎదుట దర్నా నిర్వహించనున్నట్టు సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ తెలిపారు. బ్యాంకులు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు.

Read More »

విజయవంతంగా ముగిసిన సైకిల్‌ యాత్ర

  కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏబివిపి ఆద్వర్యంలో వసతి గృహాల సమస్యల పరిస్కారం కోసం ఈనెల 21వ తేదీన ప్రారంభమైన సైకిల్‌ యాత్ర శుక్రవారం కామారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏబివిపి జిల్లా కన్వీనర్‌ మల్లే కృష్ణ మాట్లాడుతూ గాంధారి, బాన్సువాడ, బీర్కూర్‌, బిచ్కుంద, నిజాంసాగర్‌, ఎల్లారెడ్డి, లింగంపేట, కామారెడ్డి, తదితర మండలాల్లో ఉన్న 49 వసతి గృహాలు సందర్శించామన్నారు. వాటిల్లో 5 వసతి గృహాలు మినహా, అన్ని సమస్యలతో సతమతమవుతున్నాయని తెలిపారు. సొంత భవనం లేక ...

Read More »

సిసి డ్రైన్‌ పనులు ప్రారంభం

  కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టనంలోని 24వ వార్డులో శుక్రవారం సిసి డ్రైన్‌ నిర్మాణ పనులను వార్డు కౌన్సిలర్‌ రేణుక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే నిదులు రూ. 10 లక్షలతో సిసి డ్రైన్‌ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు కృసి చేస్తున్నామన్నారు. నిధులిచ్చి అభివృద్దికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు చంద్రశేఖర్‌, వార్డు వాసులు పాల్గొన్నారు.

Read More »

మాస్‌ కాపీయింగ్‌పై పిడిఎస్‌యు ఆందోళన

  కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని జిఎస్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ఎస్‌కెయు యూనివర్సిటీ దూర విద్య పరీక్షలో జరుగుతున్న మాస్‌ కాపీయింగ్‌పై పిడిఎస్‌యు నాయకులు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యు నాయకులు మాట్లాడుతూ దూరవిద్య పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గర్హణీయమన్నారు. మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్న దూరవిద్య కేంద్రాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మాస్‌ కాపీయింగ్‌కు సహకరించిన కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్‌ ...

Read More »

పాటతో తెలంగాణ బ్రతుకులకు భద్రత

  – ప్రొఫెసర్‌ తిరుమల్‌ రావు కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో పాట ప్రముఖ పాత్ర పోషించిందని తెలంగాణ సాధించుకున్న నేపథ్యంలో తెలంగాణ బతుకులకు భద్రత కావాలని అది పాట ద్వారా సాధ్యపడుతుందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల్‌రావు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కర్షక్‌బిఇడి కళాశాలలో శుక్రవారం సిరిసిల్ల గఫూర్‌ శిక్షక్‌ రచించిన ‘పాటకు సలాం’ ఆడియో సిడిని తిరుమల్‌రావు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సామాజిక గేయాలు ఉన్న పాటకు సలాం సిడి ...

Read More »

తెయు క్యాంపస్‌ను సందర్శించిన హైకోర్టు ఓఎస్‌డి

  డిచ్‌పల్లి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివి క్యాంపస్‌కు శుక్రవారం హైకోర్టు ఓఎస్‌డి రాధాకృష్ణ చౌహాన్‌ విచ్చేశారు. ఆయనతో పాటు సంగారెడ్డి కోర్టు ప్రిన్సిపాల్‌ సివిల్‌ జడ్జి మహేశ్‌ నాథ్‌ కూడా ఉన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి పరిపాలనా బవనం వద్ద స్వాగతం పలికారు. రిజిస్ట్రార్‌తో కొద్దిసేపు సమావేశమైన వారు వర్సిటీ పరిస్థితులు, లా కోర్సు, విద్యార్థుల అవకాశాలు తదితర అంశాలు సమగ్రంగా చర్చించారు. వర్సిటీ అభివృద్ది చెందుతున్న తీరును తెలుసుకొని అభినందించారు. తర్వాత ఇద్దరు లా ...

Read More »

చర్చి ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే

  నందిపేట, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని జూడా చర్చిలో శుక్రవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల హక్కులను పరిరక్షిస్తుందని క్రిస్టియన్‌ మైనార్టీలను అన్ని విధాలా అదుకుంటామని అన్నారు. దసరా, రంజాన్‌ పండగలను ప్రభుత్వం తరపున నిర్వహించిన విధంగా క్రిస్మస్‌ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. క్రిస్మస్‌ సందర్భంగా పేదవారికి దుస్తులు పంపినీ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా చర్చిల నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించామని అన్నారు. ...

Read More »

నేడు వెంకన్న ఆలయంలో అన్నదానం

  బీర్కూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాన తిరుమల ఆలయంలో శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం వెంకన్నకు ఇష్టమైన రోజు కావడంతో ఆలయంలో ఉదయంనుంచే ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని తెలిపారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా మధ్యాహ్నం భక్తుల విరాళాలతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. భక్తులు కార్యక్రమంలో పాల్గొని దైవ కృపకు పాత్రులు కావాలని అన్నారు.

Read More »

బడి బయటి పిల్లల్ని గుర్తించండి

  – ఎంఇవో గోపాల్‌రావు బీర్కూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోగల ఆయా గ్రామల్లోగల బడి బయటి పిల్లల్ని గుర్తించాలని ఎంఇవో గోపాల్‌రావు అన్నారు. మండలంలోని నసురుల్లా బాద్‌ గ్రామంలో శుక్రవారం కాంప్లెక్సు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లోగల 6-14 సంవత్సరాలలోపు బడి బయటి పిల్లలను గుర్తించాలని, అనాథలను, మతి స్థిమితం లేనిపిల్లలను గుర్తించి ఈనెల 22 లోపు నివేదికలు పంపాలని అన్నారు. వ్యాపార సముదాయాల్లో 14 ...

Read More »

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

  – ఎంపిడివో భరత్‌కుమార్‌ బీర్కూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయాగ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపిడివో భరత్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని సంగం గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి గురించి సర్పంచ్‌ వివరించగా, మంచినీటి బోర్లను పరిశీలించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృస్ట్యా భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లు ఎత్తివేసే పరిస్థితి నెలకొందని, అట్టి బోర్లకు ఫ్రెషింగ్‌ ద్వారా మరమ్మతులు చేసి తాగునీటి ఎద్దడి నివారిస్తామన్నారు. అనంతరం గ్రామంలో నిర్మించనున్న ...

Read More »

వివాహిత అదృశ్యం

  ఆర్మూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన షబానా అనే వివాహిత ఈనెల 26వ తేదీన అదృశ్యమైనట్టు ఆమె భర్త షేక్‌ హైమద్‌ ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సిఐ సీతారాం శుక్రవారం తెలిపారు. గోవింద్‌పేట్‌కు చెందిన షబానాకు షేక్‌ హైమద్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారని తెలిపారు. 26 రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి పడుకొని తిరిగి ఉదయం చూసేసరికి షబానా కనిపించకుండాపోయిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి ...

Read More »

వసతి గృహాల సమగ్ర నివేదిక సిద్దం చేయాలి

  డిచ్‌పల్లి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివిలో నాక్‌ బృందం పర్యటన సందర్భంగా వసతి గృహాలపై రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నాక్‌ పర్యటన, గ్రేడింగ్‌ విధానంలో వసతి గృహాల సమర్థవంతమైన నిర్వహణ అతిముఖ్యమైన అంశమని దానిలో భాగంగా ప్రతి అంశాన్ని రికార్డు చేయాలని, గతంలో హాస్టళ్ల అభివృద్దికి చేపట్టిన చర్యలను వివరించాలన్నారు. ప్రత్యేకంగా వసతి గృహాల్లో కల్పించిన గోదావరి నది ద్వారా 24 గంటలు అందించే మంచినీరు, తాగటానికి ప్యూరిఫైడ్‌ వాటర్‌, బాలికల వసతి ...

Read More »

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌చాలా ముఖ్యం

  – రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ ప్రయత్నాల్లో, కెరీర్‌లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఆంగ్ల భాషా పరిజ్ఞానం చాలా ముఖ్యమైన అంశాలని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. తెవివి సమాన అవకాశాల విభాగం ఆద్వర్యంలో బాలికలకు పదిరోజుల ఆంగ్ల బాసా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషపై పట్టు పరిజ్ఞానం తగిన అనుకూలతలు ఇస్తుందని ...

Read More »

ధూపల్లి ఉపాధి కూలీలతో మాట్లాడిన జిల్లా కలెక్టర్‌

  రెంజల్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి పనికి వెళ్లాలనుకునే వారు సంబంధిత గ్రామంలోని ఉపాది హామీ పథకం క్షేత్ర సహాయకులను కలువాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా సూచించారు. శుక్రవారం రెంజల్‌ మండలం దూపల్లి గ్రామంలో ఉపాది పనుల నుంచి ఇళ్లకు వెళుతున్న కూలీలతో కలెక్టర్‌ మాట్లాడారు. వారికి లభిస్తున్న వేతనాల గురించి వాకాబు చేశారు. క్షేత్ర సహాయకులు రెగ్యులర్‌గా పనులు చూపుతారని, ఒకవేళ పనులు దొరక్కపోతే తన దృస్టికి తేవాలని చెప్పారు. ఉపాధి కూలీలకు ...

Read More »

డిసెంబరు 5 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తమ వార్షిక పరీక్షల పీజు చెల్లింపు చివరి తేదినీ వర్సిటీ అధికారులు డిసెంబరు 5 వ తేదీ వరకు పొడిగించారు. అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ పాతనాగరాజు తెలిపిన వివరాల ప్రకారంవంద రూపాయల అపరాధ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ డిసెంబరు 10 వరకు ఉంటుందన్నారు. పూర్తి వివరాలు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళ నుంచి పొందగలరని పేర్కొన్నారు.

Read More »

పేద కుటుంబాలకు వంట సామగ్రి పంపిణీ

  నందిపేట, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ది ఇస్లామిక్‌ వెల్పేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ నందిపేట ఆధ్వర్యంలో శుక్రవారం స్తానిక బైపాస్‌ రోడ్డులో వెల్పేర్‌ కార్యాలయంలో నిరుపేద కుటుంబాలకు వంటసామగ్రి పంపినీ చేశారు. షేక్‌ పరీద్‌ అనే వ్యక్తికి ఆరునెలల క్రితం ప్రమాదంలో కాలువిరిగింది. అప్పటినుంచి కుటుంబ పోషణ సరిగా లేక దీనస్థితిలో జీవనం గడుపుతున్నాడు. డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన ముంతాజ్‌ బేగం భర్త నెలరోజుల క్రితం చనిపోయాడు. వీరికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఇంటి యజమాని చనిపోవడంతో ...

Read More »

మహిళా సంఘాలను పటిష్ట పరచాలి

  సదాశివనగర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో కొనసాగుతున్న మహిళా సంఘాలను పటిష్టంగా నిర్వహిస్తేనే మహిళలు అభివృద్ది చెందుతారని ఏపిఎం సాయిలు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఐకెపి మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనిధి రునాలను లబ్దిదారులు వినియోగించుకునేలా పర్యవేక్షణ చేయాలని సిసిలకు తెలిపారు. మహిళా సంఘ సభ్యురాలు నెలవారి పొదుపులను సక్రమంగా చెల్లిస్తూ గ్రామాల్లోని సంఘాలను బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏసి రవిందర్‌, సిసిలు ప్రవీణ్‌, రాజు, ఆంజనేయులు, సమాక్య అధ్యక్షురాలు ...

Read More »

ఇళ్ల స్థలాలు పరిశీలించిన ఆర్డీవో

  సదాశివనగర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో నిరుపేదలకు అందించబోయే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం కొరకు స్థలం పరిశీలించినట్టు ఆర్డీవో గడ్డం నగేశ్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత నిరుపేదలను అభివృద్ది చేయడానికి ఈ ఇళ్లు అందించడం జరుగుతుందన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని తహసీల్దార్‌ ఈశ్వర్‌కు సూచించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని నిర్మించే ఇళ్ళు పటిస్టంగా ఉండాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి పడిగెల రాజేశ్వర్‌రావు, వైస్‌ ...

Read More »

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

  మెదక్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ శాఖ అదికారుల నిర్లక్ష్యం వలన ఓ నిండు ప్రాణం బలైంది. గురువారం సాయంత్రం రామాయంపేట్‌ బైపాస్‌ రోడ్డు వద్ద విద్యుత్‌ పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరా కావడంతో తీగలతో పని చేస్తున్న నెనావత్‌ రాజేందర్‌ (26) అక్కడికక్కడే మృతి చెందాడు. కాంట్రాక్టర్‌ వద్ద కూలీగా పనిచేస్తున్న రాజేందర్‌ బచ్చరాజుపల్లి గిరిజన తాండాకు చెందినవాడు. దీంతో ఆగ్రహించిన తోటి కార్మికులు అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని సబ్‌స్టేషన్‌ ...

Read More »