Breaking News

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి

 

బీర్కూర్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఎర్గట్ల గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని బీర్కూర్‌ మండల అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షులు బంగారు మైశయ్య డిమాండ్‌ చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా ధర్నా చేపట్టి దుర్కి గ్రామ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.

ఈసందర్భంగా మైశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేడ్కర్‌ విగ్రహాలకు భద్రత కరువైందని వాపోయారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గంగారాం, సాయిలు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతు వేదికల‌ నిర్మాణాల‌కు శంకుస్థాపనలు

బీర్కూర్‌ జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నసురుళ్లబాద్‌ మండలంలో రైతువేదికల‌కు ఉమ్మడి నిజమాబాద్‌ జిల్లా ...

Comment on the article