Breaking News

కల్లు విక్రయ దారుల బైండోవర్‌

 

బీర్కూర్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో గల కల్లు విక్రయ దారులను ఎక్సైజ్‌ ఎస్‌ఐ నరేంద్రనాథ్‌ ఆద్వర్యంలో సోమవారం డిప్యూటి తహసీల్దార్‌ వరప్రసాద్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. ఈ సందర్భంగా నరేంద్రనాథ్‌ మాట్లాడుతూ ల్లు దుకాణం దారులు దుకాణానికి తప్పకుండా ప్రభుత్వ అనుమతి పొందాలన్నారు. తయారు చేసే కల్లులో మత్తు పదార్థాలు వాడరాదని సూచించారు. ఎక్సైజ్‌ దాడుల్లో కల్లు షాంపుల్‌లో మత్తు పదార్తాలు ఉన్నట్టు తేలితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కల్లు దుకాణం దారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *