Breaking News

సరైన రెజ్యుమే కీలకం

 

– రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి

డిచ్‌పల్లి, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమగ్రమైన, సరైన బయోడేటా కలిగి ఉండడం ఉద్యోగాన్వేషణలో అత్యంత కీలకమని తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి విద్యార్థులకు సూచించారు. సౌత్‌ క్యాంపస్‌ భిక్కనూరులో సోషల్‌ వర్క్‌ విభాగం ఆధ్వర్యంలో రెజ్యుమ్‌ రైటింగ్‌, ఇంటర్వ్యూ మెళకువలు అనే అంశంపై దేశ్‌పాండే ఫౌండేషన్‌తో సంయుక్తంగా సోమవారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ సరైన విధంగా ఉద్యోగాల అర్హతలకనుగుణంగా బయోడేటా తయారుచేసుకోవడం ప్రధానాంశమని అన్నారు.

అభ్యర్థి, అర్హతలు బలాలు, అదనపు ప్రత్యేక అంశాలు అన్నవి రెజ్యుమ్‌లో ప్రతి ఫలించాలని, అప్పుడే ఉద్యోగాలు ఇచ్చేవారు అభ్యర్తులను పరిగణలోకి తీసుకుంటారని వివరించారు. ఈ సందర్భంగా దేశ్‌పాండే ప్రతినిదులు మల్లమ్మ ఇతరులు విద్యార్థులకు రెజ్యుమ్‌ తయారీలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఇంటర్వ్యూ మెళకువలు వివరించారు. సోషల్‌వర్క్‌ విభాగం బిఓఎస్‌ డాక్టర్‌ రాజేశ్వరి నాయుడు, ఆచార్యులు అంజన్న, వీరభద్రం, ఏసీలు లక్ష్మణ్‌, రమాదేవి, నర్సయ్య తదితరులు నిర్వహించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ లలిత, విశిష్ట అతిథులు కుర్రా జితేంద్రబాబు, ప్రొఫెసర్‌ జైకిషన్‌, డాక్టర్‌ బాల శ్రీనివాసమూర్తి, ప్రజా సంబంధాల అధికారి డాక్టర్‌ రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Check Also

కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల కవిత కృషితో కువైట్‌ నుండి ...

Comment on the article