Breaking News

Monthly Archives: November 2015

రైతు ధర్నా గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన సమాజ్‌పార్టీ ఆద్వర్యంలో నిర్వహించనున్న రైతు ధర్నాకు సంబందించిన గోడప్రతులను మంగళవారం కామారెడ్డిలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిఎస్‌పి రాష్ట్ర ప్రధానకార్యదర్శి సిద్దార్థ ఫూలే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో హామీలు తప్పఅమలు లేదని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది మాటల ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ధర్నాను బహుజనులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం ...

Read More »

కళా నైపుణ్యాలు వెలికితీసేందుకే యువజనోత్సవాలు

  కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో మారుమూలన ఉన్న యువ కళాకారుల నైపుణ్యాలను వెలికితీసేందుకే యువజన ఉత్సవ పోటీలు నిర్వహిస్తున్నట్టు కర్షక్‌ బిఇడి కళాశాల ప్రిన్సిపాల్‌ రషీద్‌ అన్నారు. పట్టణంలోని కర్సక్‌ బిఇడి కళాశాలలో మంగళవారం జిల్లా యువజన సంక్షేమశాఖ ఆద్వర్యంలో డివిజన్‌ స్థాయి యువజన ఉత్సవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రషీద్‌ మాట్లాడుతూ సాంస్కృతిక అంశాలతో ఉత్సాహవంతులైన కళాకారులను ఎంపిక చేసేందుకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ అంశాల్లో పోటీల్లో గెలుపొందినవారు జిల్లా స్తాయికి ఎంపికవుతారని ...

Read More »

ప్రమాదవశాత్తు కారుఇంజన్‌ నుంచి మంటలు

  కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట మంగళవారం మారుతి కారు ఇంజన్‌ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులోంచి మంటలు రావడంతో అందరు అక్కడ్నుంచి పరుగులు పెట్టారు. గ్యాస్‌తో నడిచే కారు కావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కోర్టు, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల మధ్యన ప్రమాదం సంభవించడంతో జనం పరుగులు తీశారు. అక్కడున్న యువకులు కొంతమంది ధైర్యం చేసి నీటిని తీసుకొచ్చి కారుపైచల్లి మంటలు ఆర్పారు. దీంతో ప్రమాదం తప్పింది. ...

Read More »

పైకా క్రీడలు ప్రారంభించిన ఎంపిపి

  డిచ్‌పల్లి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో మంగళవారం జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాల మైదానంలో పైకా క్రీడల్ని ఎంపిపి దాసరి ఇందిర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గడీల శ్రీరాములు మాట్లాడుతూ విద్యార్తులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరమన్నారు. క్రీడల వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు అందరు క్రీడల్లో పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే తనయుడు బాజిరెడ్డి జగన్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజ్‌, పిఇటిలు, గ్రామస్తులు విద్యార్థులు ...

Read More »

ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని తహసీల్దార్‌కు వినతి

  కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ శివారులోని బైపాస్‌ రోడ్డుపక్కనేగల సర్వేనెంబరు 170, 171లో గుడిసెల్లో నివసిస్తున్న తమకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మంగళవారం తహసీల్దార్‌ అనిల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బైపాస్‌ రోడ్డులో గుడిసెలు వేసుకొని ఉంటున్నామని కూలీపనులకు వెళుతూ పూటగడవని స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి గుడిసెలు కాలినపుడు ఇళ్లకు దరఖాస్తులు పెట్టుకుంటే ఇస్తామని అధికారులు ...

Read More »

తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విత్తన రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి

  – విసి పార్థసారధి డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే విత్తన రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెవివి వైస్‌చాన్స్‌లర్‌ సి.పార్థసారధి తెలిపారు. ఆయన సోమవారం గోవాలో జరుగుతున్న ఏషియన్‌ సీడ్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం విత్తన అభివృద్దికి అనుకూలమైన ప్రదేశమని తెలుపుతూ, ప్రభుత్వం మన రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మలిచేందుకు అనేక చర్యలు చేపట్టిందని వివరించారు. రైతు ఆధారిత విధానాల అమలు, రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ...

Read More »

విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి

  ఆర్మూర్‌ నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారని ప్రజ్ఞ పాఠశాల కరస్పాండెంట్‌ గంగామోహన్‌ అన్నారు. ఆర్మూర్‌లోని ప్రజ్ఞ హైస్కూల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వయం పరిపాలన దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో కష్టపడి చదివి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు. అంతకుముందు విద్యార్థుల ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.

Read More »

సిద్దుల గుట్టను సందర్శించిన కేంద్ర మంత్రులు

  ఆర్మూర్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దుల గుట్టను కేంద్ర మంత్రులు సోమవారం దర్శించుకున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని లక్కంపల్లి గ్రామంలో ఆగ్రో ఫుడ్‌ పార్కు ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రులు కార్యక్రమం అనంతరం సిద్దులగుట్టపైగల రామాలయం, శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎంపి కవిత తదితరులున్నారు.

Read More »

ప్రశాంతంగా ముగిసిన ప్రిపిహెచ్‌.డి పరీక్షలు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్‌డి చేస్తున్న రీసెర్చ్‌ స్కాలర్స్‌ కోసం నిర్వహించిన ప్రి పిహెచ్‌డి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. నవంబర్‌ 13న రీసర్చ్‌ మెథడాలజీ పరీక్ష, సోమవారం సబ్జెక్టు స్పెషలైజేషన్‌ పరీక్ష ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించారు. సోమవారం రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి పరీక్షా కేంద్రాన్ని తనికీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్న తీరును తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మూడు పరీక్ష హాల్స్‌లో దాదాపు 13 సబ్జెక్టులకు చెందిన ...

Read More »

ప్రశాంతంగా బి.ఈడి స్పాట్‌ అడ్మిషన్లు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో రెండు సంవత్సరాల బిఇడి 2015-16 అకడమిక్‌ సంవత్సరానికి సోమవారం రోజు ప్రశాంతంగా జరిగాయి. పూర్తి పారదర్శకతతో, మెరిట్‌, రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా స్పాట్‌ అడ్మిసన్లు నిర్వహించాలని ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా ఈ స్పాట్‌ అడ్మిషన్లు పకడ్బందీగా నిర్వహించాలని ఆచార్య లింబాద్రి కమిటీకి ఆదేశాలిచ్చారు. నవంబర్‌ 13 వరకు అప్లికేషన్లు సమర్పించిన ...

Read More »

పిహెచ్‌డి దరఖాస్తు గడువు పెంపు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిహెచ్‌డి దరఖాస్తులు సమర్పించేందుకు గడువు తేదీ పెంచినట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఈనెల 11న ముగిసిన గడువును, వరుస సెలవుల నేపథ్యంలో ఈనెల 21 శనివారం వరకు పెంచినట్టు ఆయన తెలిపారు. అబ్యర్థుల కోరిక మేరకు దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీని నవంబర్‌ 21 వరకు పెంచినట్టు రిజిస్ట్రార్‌ తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను అడ్మిషన్ల డైరెక్టర్‌ కార్యాలయంలో కొత్తగా పొడిగించిన తేదీ వరకు సమర్పించాలని అన్నారు.

Read More »

స్మార్ట్‌ ఆగ్రో మెగా ఫుడ్‌ పార్కుకు శంకుస్థాపన

  నందిపేట్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని నందిపేట మండలంలోగల లక్కంపల్లి సెజ్‌కు మహర్ధశ వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న పరిశ్రమల ఏర్పాటు కల సోమవారంతో సాకారమైంది. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సింరత్‌కౌర్‌ బాదల్‌, సహాయ మంత్రి సాద్వి నిరంజన్‌, ఎంపి కవిత, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. 372 ఎకరాల సెజ్‌ భూముల నుంచి 80 ఎకరాల్లో స్మాట్‌ ఆగ్రో మెగా ఫుడ్‌ పార్కు నిర్మిస్తున్నారు. ఇందులో కోల్డ్‌ స్టోరేజ్‌, గిడ్డంగులు, డైరీ, సోయా, పసుపు ...

Read More »

గ్రామ పంచాయతీ స్థలంలో అక్రమ నిర్మాణాలు తొలగించాలి

  ఆర్మూర్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన లేఅవుట్‌ చేసి వదిలిన 10 శాతం స్థలాన్ని వేముల గంగారెడ్డి అలియాస్‌ విశాఖ గంగారెడ్డి 325 గజాల స్థలాన్ని ఆక్రమించి పాఠశాల ప్రహరీగోడను నిర్మించుకున్నట్టు వైస్‌ ఎంపిపి ఇత్తడి రాజన్న, ఎంపిపి పద్మజ, వార్డు సబ్యుడు గంగామోహన్‌, తెరాస నాయకులు ఎం.డి. అహ్మద్‌లు జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. పెర్కిట్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వేనెంబరు 204/1, 207/1ఎ, ...

Read More »

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

  రెంజల్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు నేరుగా తమ సమస్యలు పరిష్కరించుకోవడానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని ఇందులో తమ సమస్యలు విన్నవించుకున్నట్టయితే వారంరోజుల్లోపు సమస్యలు పరిష్కరించేంత వరకు కృసి చేయడం జరుగుతుందని తహసీల్దార్‌ వెంకటయ్య అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు ఫిర్యాదులు స్వీకరించినట్టు ఆయన అన్నారు. ఈ ఫిర్యాదులను వారం రోజుల్లోపు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు హాజరయ్యారు.

Read More »

పేకాట స్థావరంపై దాడి – ఐదుగురి అరెస్టు

  రెంజల్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రవికుమార్‌ తన సిబ్బందితో దాడిచేసి ఐదుగురు పేకాట రాయుళ్లను, 230 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Read More »

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము. 1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి. 2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు ...

Read More »

భ్రూణ హత్యలు నివారించండి

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భ్రూణ హత్యలు నివారించండి, ఆడపిల్లలను గర్భంలోనే తుంచి వేసే దురాచారానికి స్వస్తి పలకాలని చిన్నారులు నిర్వహించిన ప్లాష్‌ మాబ్‌ పలువురిని ఆకట్టుకుంది. శనివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టారు. అందరిలాగా కాకుండా వినూత్నంగా ఆలోచించి సమాజంలో జరుగుతున్న భ్రూణహత్యలపై తమ గొంతు వినిపించారు. సేవ్‌ గర్ల్‌ చైల్డ్‌ నినాదంతో సుప్రియా డ్యాన్సు అకాడమీ కామారెడ్డి వారు బాలల దినోత్సవం రోజు కామారెడ్డి రైల్వేస్టేషన్‌ ఆవరణలో ‘మ్లాఫ్‌ మాబ్‌’ డ్యాన్స్‌ ...

Read More »

భిక్కనూరు ఎస్‌ఐ తన వైఖరి మార్చుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు ఎస్‌ఐ రాంబాబు తన వైఖరి మార్చుకోవాలని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ అన్నారు. ఎస్‌ఐ రాంబాబు ప్రజా సమస్యలపై, కార్మిక సమస్యలపై ఆందోలన చేస్తున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. వ్యక్తిగత దూషణలు కక్ష పూరితంగానే చేస్తున్నారని ఆరోపించారు. చీకటి దందాలు, సెటిల్‌మెంట్లు, సివిల్‌ తగాదాల్లో ఎస్‌ఐ జోక్యంపై తనవైఖరి మార్చుకోకుంటే తాడ్వాయిలో జరిగిన మాదిరిగా ప్రజలే బుద్దిచెపుతారని అన్నారు. ఎస్‌ఐపై ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. శాంతి భద్రతలపై ...

Read More »

తహసీల్దార్‌ నిర్వాకం వల్ల 1422 ఓట్ల గల్లంతు

  – సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ పరిధిలోని 24వ వార్డులో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 3122 ఓట్లు ఉండగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తహసీల్దార్‌ నిర్వాకం వల్ల 1422 ఓట్లు తొలగించారని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తుగా మారి కనీస విచారణ లేకుండా ఎలక్షన్‌ కమీషన్‌ను తప్పుదోవ పట్టిస్తూ ఒక్క 24వ వార్డులోనే 1422 ఓట్లు ...

Read More »

ఆర్చరీ జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థికి సన్మానం

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని సాందీపని జూనియర్‌ కళాశాలకు చెందిన సి.హెచ్‌.ఉదయ చంద్ర అండర్‌- 19 విభాగంలో రెండోస్థానంలో సిల్వర్‌ మెడల్‌ సాధించి ఆర్చరీ జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. కరీంనగర్‌లో స్కూల్‌జోన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆద్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ఉదయచంద్ర సిల్వర్‌ మెడల్‌ సాధించి జార్ఖండ్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థిని ప్రిన్సిపాల్‌ బాలాజీరావు, సిబ్బంది సన్మానించారు. మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు.

Read More »