Breaking News

Monthly Archives: November 2015

ఇళ్ల స్థలాలు పరిశీలించిన ఆర్డీవో

  సదాశివనగర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో నిరుపేదలకు అందించబోయే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం కొరకు స్థలం పరిశీలించినట్టు ఆర్డీవో గడ్డం నగేశ్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత నిరుపేదలను అభివృద్ది చేయడానికి ఈ ఇళ్లు అందించడం జరుగుతుందన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని తహసీల్దార్‌ ఈశ్వర్‌కు సూచించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని నిర్మించే ఇళ్ళు పటిస్టంగా ఉండాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి పడిగెల రాజేశ్వర్‌రావు, వైస్‌ ...

Read More »

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

  మెదక్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ శాఖ అదికారుల నిర్లక్ష్యం వలన ఓ నిండు ప్రాణం బలైంది. గురువారం సాయంత్రం రామాయంపేట్‌ బైపాస్‌ రోడ్డు వద్ద విద్యుత్‌ పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరా కావడంతో తీగలతో పని చేస్తున్న నెనావత్‌ రాజేందర్‌ (26) అక్కడికక్కడే మృతి చెందాడు. కాంట్రాక్టర్‌ వద్ద కూలీగా పనిచేస్తున్న రాజేందర్‌ బచ్చరాజుపల్లి గిరిజన తాండాకు చెందినవాడు. దీంతో ఆగ్రహించిన తోటి కార్మికులు అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని సబ్‌స్టేషన్‌ ...

Read More »

ఎన్‌ఎస్‌ఎఫ్‌ కబ్జా భూములపై విచారణ జరపాలి

  బోధన్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కబ్జాకు గురైన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేయాలని అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్ముల గంగాధర్‌, సిపిఐ (ఎంఎల్‌) బోధన్‌ డివిజన్‌ కార్యదర్శి వరదయ్య ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గతంలో ఈ భూములను ప్రజా ఉద్యమాల ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అందించిన విషయం ...

Read More »

పాకిస్తాన్ కు అమీర్ ఫ్లైట్ టికెట్స్ ..

దేశంలో అసహనం ఉందంటూ, దేశం వెళ్లిపోవాలని అంటూ ఉందని బాలీవుడ్ నటుడు అమీర్ చేసిన సంచలన వాఖ్యాల ఫై ఇంకా దుమారం చెలరేగుతూనే ఉంది.అమీర్ ఈ వాఖ్యాలను వెనక్కు తీసుకున్న కానీ ఆందోళన కారులు మాత్రం ఆందోళనలు ఆపడం లేదు.. తాజాగా హిందూసేన సంస్థ ఏకంగా అమీర్ కుంటుంబం మొత్తానికి పాకిస్తాన్ కు ఫ్లైట్ టిక్కట్లు బుక్ చేసి సంచలనం సృష్టించింది. అమీర్ ఖాన్ , ఆయన భార్య, కొడుకు కోసం నవంబర్ 30న పాక్ వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ అయ్యాయని, వాటిని ...

Read More »

ఐటెం భామను పెళ్లి చేసుకోబోతున్న దేవి శ్రీ..?

గత వారం రోజులుగా రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి వ్యవహారం తెగ హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే..ఇంతకి ఈ రాక్ స్టార్ ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు..? సినిమా ఇండస్ట్రీ అమ్మాయినా లేక వేరే అమ్మాయిని చేసుకుంటాడా..? అని అందర్లో ఆసక్తి నెలకొంది..అయితే వారి ఆసక్తి కి తెర పడిందని తెలుస్తుంది.. ఫిలిం నగర్ లో ఈరోజు ఉదయం నుండి దేవి శ్రీ ఓ హీరోయిన్‌తో తన జీవితాన్ని పంచుకోబోతున్నాడని , అది కూడా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం ...

Read More »

సైజ్ జీరో రివ్యూ

అనుష్క , ఆర్య , ప్రకాష్ రాజ్.. ప్రకాష్ కోవెలమూడి ప్రసాద్ వి పోట్లురి ఎమ్.ఎమ్.కీరవాణి అనుష్క, ఆర్య ప్రధానపాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్‌పై దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘సైజ్‌ జీరో’. బాహుబలి, రుద్రమదేవి, చిత్రాల తర్వాత అనుష్క నటించిన ఈ చిత్రం ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ఎంత వరకు అందుకుందో..అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌంద‌ర్య‌ (అనుష్క‌) చిన్న‌ప్ప‌ట్నుంచీ తిండి ఫై బాగా మక్కువ ..దాంతో ...

Read More »

అంకురార్పణ

విత్తు విత్తినంతమాత్రన చివుళ్లు వేయదు. నారు తీసి, నీరు పోసి, సంరక్షిస్తేనే మొలకెత్తి మొక్కై మహావృక్షంగా ఎదిగి పది మందికీ నీడ నిస్తుంది. ఫలాలనిచ్చి కడుపునింపుతుంది. ఆలోచన కూడా విత్తనం లాంటిదే. గాలికి రెపరెపలాడే దీపంలా మిణుకు మిణుకుమనే ఆలోచనకు ఊపిరులూది ఊతమిస్తే, ఊడలూని ఓ మహా సంస్థ ఆవిర్భావానికి దారి తీయొచ్చు. ఎందరికో ఉపాధి బాటలు పరచవచ్చు. మేధావులకు మాతృభూమిగా విలసిల్లే భారతావనిలో ఔత్సాహికులకు కొదవ లేదు. యువశక్తికి అంతకంటే కొదవ లేదు. ఎటొచ్చీ తమలో రగిలే ఆలోచనలకు గమ్యమెటో తెలీక, దిశానిర్దేశం ...

Read More »

డిసెంబరు 2న స్థానిక సంస్థల ఎన్నికకు నోటిఫికేషన్‌

  నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైనందున ప్రవర్తన నియమావళి అమల్లోకివచ్చిందని, ప్రజా ప్రతినిదులు ఈ నియమావళి ఖచ్చితంగా పాటించేలా చూడాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా కలెక్టర్లతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌ మినహా తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాల్లో షెడ్యూల్‌ విడుదల తేదీ ఈనెల 24 నుంచి ఎన్నికల ప్రవర్తన ...

Read More »

డాక్టర్‌ అంబేడ్కర్‌ మహోన్నత వ్యక్తి

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్య యుతంగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ, ప్రజలలో తరతరాలుగా నెలకొన్న సామాజిక అసమానతలను తొలగించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి డాక్టర్‌ అంబేడ్కర్‌ అని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా పేర్కొన్నారు. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు పురస్కరించుకొని గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా ...

Read More »

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు సకాలంలో చెల్లించాలి

  నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల గౌరవ వేతనాన్ని ప్రతినెల సకాలంలో చెల్లించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రానా స్పష్టం చేశారు. ప్రతినెల 5వ తేదీలోపు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాల ఫైల్‌ సమర్పించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. నెలల తరబడి గౌరవ వేతనాన్ని చెల్లించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్‌ హెచ్చరించారు.

Read More »

శుభకార్యానికి వెళ్తూ కానరాని లోకాలకు…

  – రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి – అంతా ఆదిలాబాద్‌ వాసులే కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివాహానికి వెళ్తూ కానరాని లోకాలకు చేరిన ఘోర సంఘటన కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్‌ జిల్లా ముధోల్‌కు చెందిన ఆరుగురు హైదరాబాద్‌లో పెళ్ళికి వెళ్లేందుకు టవేరా వాహనంలో బయల్దేరారు. కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి శివారువద్ద వాహనం టైర్‌ పేలిపోవడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం బోల్తాపడడంతో ప్రయానిస్తున్న ఆనంద్‌రావు (36), బోజిరావు ...

Read More »

సమగ్ర నివేదికతో సిద్దం కండి

  డిచ్‌పల్లి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్‌ పై రిజిస్ట్రార్‌ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఇందులో ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ న్యాక్‌ బృందం యూనివర్సిటీ సందర్శిస్తుంది కావున ఏ గ్రేడ్‌ కొరకు ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. గత ఐదేళ్ల నుంచి వివిధ యూనిట్ల ద్వారా నిర్వహించిన అన్ని కార్యక్రమాలను ఫోటోలతో సహా రికార్డు చేసి సమాజానికి ప్రత్యేకంగా ఉపయోగపడేలా చేసిన కార్యక్రమాలను వివరించాలని పేర్కొన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు జాతీయ, ...

Read More »

మానసిక స్థైర్యం ఉంటే విజయం మనదే

  నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వికలాంగులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా తెలిపారు. గురువారం కలెక్టర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన వికలాంగుల ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఆటల పోటీల్లో స్నేహ సొసైటీ, గ్రేస్‌ ఆర్గనైజేషన్‌, ఎపి ఫోరం, సిఎస్‌ఐ మూగ, చెవుడు పాఠశాల, వికలాంగులసంక్షేమ వసతి గృహానికి చెందిన శారీరక, మానసిక, దృష్టి లోపం, మూగ చెవుడు గల సుమారు 350 మంది విద్యార్థిని, ...

Read More »

ధర్నా విజయవంతం చేయాలి

  ఆర్మూర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన న్యాయవాదులను ప్రబుత్వం విస్మరించడాన్ని నిరసిస్తూ ఈనెల 27న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులంతా ధర్నా చేస్తున్నట్టు ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేశ్వర్‌ తెలిపారు. దర్నాకు జిల్లాలోని న్యాయవాదులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.

Read More »

కబడ్డి పోటీలు

  ఆర్మూర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివాసీ నాయక్‌పోడ్‌ సేవా సంఘం ఆద్వర్యంలో కార్తీకపౌర్ణమి బీమన్న పండగ సందర్భంగా గురువారం మండలంలోని చేపూర్‌ గ్రామంలో కబడ్డి పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన నాయక్‌పోడ్‌ క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

Read More »

డివిజన్‌ స్తాయి యాదవ సంఘం సమ్మేళనం

ఆర్మూర్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో గురువారం ఆర్మూర్‌ డివిజన్‌ స్తాయి యాదవ సంఘం సమ్మేళనం నిర్వహించారు. సమావేశానికి ఆర్మూర్‌ డివిజన్‌లోని గొల్లకుర్మలు పెద్దఎత్తున హాజరయ్యారు. యాదవకులస్తుల డిమాండ్ల సాదనకు సమ్మేళనం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో యాదవ కులస్తులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను సాధనకు కృసి చేస్తామని సమావేశంలో పేర్కొన్నారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున గొల్లకుర్మలు హాజరయ్యారు.

Read More »

ముస్లిం రిజర్వేషన్ల సాధన దీక్షా

  నందిపేట, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలపుడు ఇచ్చిన వాగ్దానం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు పరచాలని కోరుతూ నిజామాబాద్‌లోని బోధన్‌ బస్టాండ్‌ చౌరస్తా వద్ద అన్ని ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, కాంగ్రెస్‌, సిపిఐ, వెల్పేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, ముస్లింలీగ్‌ సంయుక్తంగా ధర్నా నిర్వహించారు. ఇందులో వెల్పేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జిల్లా అధ్యక్షుడు అన్వర్‌ఖాన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలపుడు చేసిన 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు ...

Read More »

కేదారేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

  నందిపేట, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. చుట్టూ పక్కల ఆయా గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 40 క్వింటాళ్ల బియ్యంతో 20 వేల మందికి సరిపడా భోజన సౌకర్యం కల్పించి అన్నదానంచేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Read More »

అందరి సమస్యలు పరిష్కరిస్తాం

  నందిపేట, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ సమస్యలు దశల వారిగా పరిష్కరించడానికే పల్లె నిద్ర కార్యక్రమం ప్రారంభించినట్టు ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే బుధవారం రాత్రి మండల కేంద్రంలోపల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. కుల సంఘాల వారి నుంచి, వివిధ వర్గాల వారినుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో పల్లెనిద్ర నిర్వహించారు. తెల్లవారుజామున స్తానిక కేదారేశ్వర ఆలయం, పలుగుట్ట చేరుకొని మంగిరాములు ...

Read More »

పౌష్టిక ఆహారం

ఆహారం ఆహారం(Food) జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది.  పిండిపదార్ధాలు,  మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు,  ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికికావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. ఆహారాన్ని పచనం చేయడాన్ని వంట అంటారు. ప్రతి సంప్రదాయానికి ప్రత్యేకమైన వంట ఉంటుంది. పాతకాలంలో వృత్తిపరమైన వంట గురుశిష్య పరంపరగా నేర్చుకున్నా ఈకాలంలో కళాశాలలు పాకశాస్త్రానికి (కేటరింగ్) పట్టాలు ఇస్తున్నాయి. పురాణాలలో నలుడు, భీముడు పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి ...

Read More »