Breaking News

Monthly Archives: November 2015

రక్తపోటు ఉన్నవారు సెక్ష్ లో పాల్గొనవచ్చా?

Q :రక్తపోటు ఉన్నవారు సెక్ష్ లో పాల్గొనవచ్చా? A : చాలా మందికి రక్తపోటు ఉన్నా సెక్ష్ లో ఎటువంటి బాధా ఉండదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో బాధ తెలుస్తుంది. సెక్ష్ లో పాల్గొన్నప్పుడు ఆరోగ్యవంతునకైనా కొంద్ది సేపు బి.పి పెరుగుతుంది. రక్తపోటు ఉన్నవారికి మరింత పెరుగుతుంది. దాంతో వళ్ళు బరువుగా ఉండడము , తలతిరిగేటట్లు అనిపించడము , చిన్నగా తలనొఫ్పి రావడము జరుగుతూ ఉంటాయి. అందుకని బి.పి ఉన్నవారు దాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. బిపి రీడింగ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు … అది ...

Read More »

పిల్లలకు పోషకాహారం

బడికి వెళ్ళే ముందు వయసు పిల్లలకు  పోషకాహారం (1-5 సంవత్శరాలవయసు) చనుబాలు మానిపించేందుకు ఇది కీలకమైన సమయం ఇతర వైవిధ్యమైన ఆహారాన్ని జోడించేందుకు పాలపరిమాణాన్ని మెల్లగా తగ్గించాలి. చిన్నబిడ్డల యొక్క ఆహారానికి ప్రత్యేకశ్రద్ధ మరియు ప్రణాళిక అవసరం శక్తి మరియు పోషకాల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఆకలి తక్కువగా ఉంటుంది మరియు ఆహారపు అలవాట్లు గడబిడగా ఉండొచ్చు.కాబట్టి,వారి ఆహారం క్రమమైన,చిన్నవైన పోషకసాంద్రతతోకూడినవిగా ఉండాలి. బడికి వెళ్ళేముందు వయసు పిల్లలకు  తగిన ఆహారం ఆరవనెలనుంచి తల్లిపాలతోపాటు మంచి అనుబంధ ఆహారం తీసుకుంటున్న శిశువు ...

Read More »

నేటి నుంచి నిత్యాన్నదానం

ఆర్మూర్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సంవత్సరం పట్టణంలోని జంబిహనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అదే క్రమంలో ఈయేడు కూడా స్వాములకు బుధవారం నుంచి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణానికి చెందిన టిఎస్‌పిసిసి కార్యదర్శి అయ్యప్ప బక్తుడు ఏ.బి. శ్రీనివాస్‌ దాతగా వ్యవహరించగా, ఆర్మూర్‌ అయ్యప్ప సమితి ఆధ్వర్యంలో వరుసగా 9వ సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరి 5వ తేదీ వరకు సత్రం కొనసాగుతుందని చెప్పారు.

Read More »

వైభవంగా శ్రీవారి రథోత్సవం

  భీమ్‌గల్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నింబాచలం లింబాద్రిగుట్టపై శ్రీలక్ష్మి నర్సింహస్వామి వారి రథోత్సవం బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టకు పక్క గ్రామాలు, జిల్లా నలుమూలల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రథోత్సవాన్ని కన్నులారా వీక్షించి పునీతులయ్యారు. గుట్టంత స్వామివారి నామస్మరణతో మారుమోగింది. అర్చకుల వేదమంత్రాల నడుమ రథం ముందుకు సాగుతుంటే భక్తులు లాగుతూ, మంగళహారతులు సమర్పిస్తూ, టెంకాయలు ...

Read More »

ప్రతి విద్యార్థి సమాజ నిర్మాణంలో పాలుపంచుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి విద్యార్థి సమాజ నిర్మాణంలో పాలుపంచుకోవాలని సమాజ నిర్మాణానికి ఉపయోగపడాలని కామారెడ్డి డిప్యూటి డిఇవో బలరాం అన్నారు. కామారెడ్డి పట్టణ టిఆర్‌ఎస్‌ ఎంఎ ఆధ్వర్యంలో స్థానిక సత్య గార్డెన్స్‌లో పట్టణంలోని అన్ని ప్రయివేటు పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై బలరాం మాట్లాడారు. విద్యార్థులు అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. విశిష్ట అతిథిగా హాజరైన మాస్టర్‌ మైండ్స్‌ ఛైర్మన్‌ మోహన్‌, వ్యక్తిత్వ వికాస నిపుణులు ...

Read More »

అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

  కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంతో పాటు డివిజన్‌లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న డిగ్రీ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష ఫీజుల పేరుతో డిగ్రీ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్పెషల్‌ ఫీజు, కామన్‌ సర్వీసు ఫీజుల పేరిట ప్రతి విద్యార్థి నుంచి అదనంగా 1000 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతమున్న ఫీజులు చెల్లించడమే ...

Read More »

వైభవంగా కార్తీకపౌర్ణమి వేడుకలు

  కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తులు, ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కార్తీక మాసంలో అతిపవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమికి శివాలయాలకు వెళ్ళి పరమ శివుని దర్శించుకుంటే సకల సంపదలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలతో, తోరణాలు, ముగ్గులతో అలకరించుకున్నారు. శివునికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని శివాయలయాలతో పాటు తాడ్వాయి ...

Read More »

ఘనంగా శ్రీరామనామ స్మరణ

ఆర్మూర్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ వ్యాప్తంగా నామజపయజ్ఞ సమితి ఆద్వర్యంలో బుధవారం శ్రీరామ నామ స్మరన కార్యక్రమం ఆర్మూర్‌లోని సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా నిర్వహించారు. ప్రథమ కరసేవ జరిగి 25 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కార్తీక పౌర్ణమి ఉదయం 11.15 నుంచి 12.30 గంటల వరకు శ్రీరామ నామస్మరన కార్యక్రమం సమితి సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆహుతులు పెద్ద ఎత్తున హాజరై నామస్మరణ చేశారు. మహిళలు , భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఘనంగా శ్రీరామనామ ...

Read More »

విలువలతో కూడిన నాణ్యమైన విద్య అవసరం

  నందిపేట, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలిండియా ఐడియల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ నిజామాబాద్‌ ఆధ్వర్యంలో స్తానిక ఖిల్లా రోడ్డులోని కింగ్స్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం జరిగిన సింపోజియంలో వక్తలు డైట్‌ లెక్చరర్‌ డాక్టర్‌ అబ్దుల్‌ రషీద్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్తులను పాస్‌ చేయించడమే లక్ష్యం కాకుండా విద్యార్థులకు నైతిక, సామాజిక విలువలు పెంపొందించడానికి కృషి చేయాలని, పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన రీజినల్‌ సెక్రెటరీ అస్లాం ముజాహిద్‌ ...

Read More »

గోదావరి ఒడ్డున కార్తీక అన్నదానం

  బాసర, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్తీక మాసం పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ బాలయోగి కృష్ణ పిట్ల మహరాజ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వామీజీ నిజామాబాద్‌ శివారులోని గాంధీనగర్‌ వద్ద లింగేశ్వర ఆశ్రమము నిర్వహిస్తున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆశ్రమం నుంచి గోదావరి బాసర వరకు బుధవారం పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. స్వామీజీ వెంట సుమారు 600 మంది భక్తులు కాలినడకన బాసర చేరుకున్నారు. ఈ సందర్భంగా బక్తులకు అన్నదాన కార్యక్రమం ...

Read More »

ఘన్‌పూర్‌లో కుంకుమార్చన

  డిచ్‌పల్లి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్తీక మాస పౌర్ణమి దీపోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామంలోని హనుమాన్‌ ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కూచి కిషన్‌ వేదపండితులు సారధ్యం వహించారు. ఉదయమే మహిళలు మంగళ హారతులతో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారికి పాలతో అభిషేకం నిర్వహించారు. అలాగే సాయంత్రం ఆలయంలో లక్ష దీపారాధన కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం గత 15 ...

Read More »

తెరాస విజయోత్సవ సంబరాలు

  నందిపేట, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్లు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఘన విజయం సాధించడం పట్ల మండల తెరాస నాయకులు బస్టాండ్‌ ఎదుట, పార్టీ కార్యాలయం ముందు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనంద సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నక్కల భూమేశ్‌ మాట్లాడుతూ ప్రజా అభివృద్ది సంక్షేమ పథకాలే పార్టీని గెలిపించాయని, ఇది ఇతర పార్టీల వారికి గుణపాఠం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి బాల గంగాధర్‌, అహ్మద్‌ ఖాన్‌, ప్రవీణ్‌గౌడ్‌, ...

Read More »

నిందితుని రిమాండ్‌

  నందిపేట, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రానికి చెందిన ఉప్పరి జానకిరాజును రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం… జానకిరాజు సిరికొండ మండలం రెవెన్యూ కార్యాలయంలో అటెండరుగా పనిచేస్తున్నాడు. అక్టోబరు 1వ తేదీ అర్ధరాత్రి అతనిభార్య ఏసుమనిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఏసుమని చికిత్స పొందుతూ అక్టోబరు 4న మృతి చెందింది. మృతురాలు మేజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఆర్మూర్‌ రూరల్‌ సిఐ లక్ష్మినర్సింహస్వామి నిందితుడు జానకిరామ్‌ను మంగళవారం అరెస్టుచేసి రిమాండ్‌కు ...

Read More »

కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ

  ఆర్మూర్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశపు హాలులో మంగళవారం విద్యపై డివిజన్‌ స్తాయి ఉపాద్యాయులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణలో మూగ, చెవిటి, వైకల్య విద్యార్థులకు పాఠశాలలో ఏవిధంగా చదువు నేర్పించాలో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఇవో రాజగంగారాం, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆలయాల్లో కార్తీక శోభ

  ఆర్మూర్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టనంతో పాటు మండలంలోని ఆంజనేయ, శివాలయాలకు కార్తీక శోభ సంతరించుకుంది. మహిళలు భక్తి ప్రపత్తులతో కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని దీపారాధన చేశారు.

Read More »

పెర్కిట్‌లో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన

  ఆర్మూర్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌ గ్రామంలోగల జడ్పిహెచ్‌ఎస్‌ ఆవరణలో మంగళవారం సరస్వతి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓబన్న మాట్లాడుతూ 1984 విద్యాసంవత్సరపు పూర్వ విద్యార్థులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమానికి ఎంఇవో రాజగంగారాం, స్థానిక ప్రజా ప్రతినిదులు పాల్గొని సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Read More »

చిన్నారులకు బహుమతి ప్రదానం

  కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని డ్రైవర్స్‌ కాలనీ కామారెడ్డి స్కూల్లో లిమ్రా మిల్లత్‌ పీస్‌ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం జరిపారు. పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, కామారెడ్డి ద్వితీయశ్రేణి న్యాయమూర్తి సలీం, కౌన్సిలర్లు అంజద్‌, నాయకులు రాంకుమార్‌గౌడ్‌, ఆర్‌.ఎస్‌.బాబా, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మై విలేజ్‌, మాడల్‌ విలేజ్‌ ఆద్వర్యంలో స్వచ్ఛభారత్‌

  కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఎంపిపిఎస్‌ ఒడ్డెర కాలనీ పాఠశాలలో మంగళవారం మై విలేజ్‌, మాడల్‌ విలేజ్‌ పౌండేషణ్‌ ఆద్వర్యంలో స్వచ్ఛభారత్‌ స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఫౌండేషన్‌ ప్రతినిధులు పాఠశాల ఆవరణ శుభ్రంచేశారు. ఆవరణలోని పిచ్చిమొక్కలు, గడ్డి, చెత్త చెదారం తొలగించి శుభ్రం చేశారు. పాఠశాల పరిశుభ్రంగా ఉంచుకొని విద్యార్తులు శుభ్రంగా ఉండి ఆరోగ్యాన్ని పొందాలన్నారు. అనంతరం అక్కడే మొక్కలు నాటారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మసూద్‌ అలీ, జోనల్‌ అధికారి ...

Read More »

కామారెడ్డి వాసికి జయశంకర్‌ అవార్డు ప్రకటన

  కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జేఏసిలో చురుకుగా పాల్గొంటూ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన జూకంటి ప్రభాకర్‌రెడ్డికి దళిత సాహిత్య అకాడమి జయశంకర్‌ అవార్డు ప్రకటించింది. ప్రభాకర్‌రెడ్డికి జయశంకర్‌ అవార్డు రావడం పట్ల తెరసం ప్రతినిదులు, జేఏసి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్‌ జగన్నాథం మాట్లాడారు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన వ్యక్తికి జయశంకర్‌ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా ...

Read More »

తెరాస విజయోత్సవ సంబరాలు

  కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్లు పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి దయాకర్‌ 4.50 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో తెరాస నాయకులు కామారెడ్డిలో సంబరాలు జరుపుకున్నారు. దయాకర్‌ ఎంపిగా గెలిపించిన వరంగల్‌ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌, తెరాస పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మిఠాయిలు తినిపించుకొని వేడుకలు చేశారు. టపాసులు కాల్చి విజయ సంబరాలు జరిపారు. ప్రభుత్వ పథకాలే అభ్యర్థిని గెలిపించాయని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ...

Read More »