Breaking News

శునకానికి అంత్యక్రియలు

 

సదాశివనగర్‌, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సూడుంరి గి మనిషి పెంచుకున్న కుక్క చచ్చిపోతే అంత్యక్రియలు నిర్వహించిండు… ఎంత మానవత్వం… ఎంత మాయ…. గీనకు కుక్కమీదనే గింత ఆత్మీయత ఉంటే మనుషుల మీద ఇంకెంత ఉంటదో..

సరేగని ఏమయిందో సూద్దాం.. మండల కేంద్రానికి చెందిన ఉప్పల సుధాకర్‌ ఇంట్ల పదేళ్ళ సంది కుక్కను పెంచుకుంటున్నడు. ఏమయిందో ఏమో గని రెండ్రోజుల సంది కుక్కకు జబ్బు అచ్చిందని దవాఖానకు తీసుకపోయి చికిత్స చేయించిండు. అయినా జబ్బు నయం కాలే. పాపం బుధవారం పొద్దుగల్ల చచ్చిపోయింది. సుధాకర్‌ పదేళ్ళ సంది తనకాడ విశ్వసనీయంగా ఉన్నందుకు మనసుల బాధపడుతూనే కుక్కకు అంత్యక్రియలు చేసిండు. గీనలెక్కనే అందరికి పశువులతో పాటు మనుషుల మీద గూడ మానవత్వం ఉంటే ఎంత మంచిగుంటది. దునియా అంత సల్లగుంటది కదా.

Check Also

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత ...

Comment on the article