Breaking News

క్రమబద్దీకరణ చేసుకోకుంటే చర్యలు తప్పవు

 

కామారెడ్డి, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో అనధికారికంగా ఉన్న బిల్డింగ్‌లు, ప్లాట్లను క్రమబద్దీకరణ చేసుకోకుంటే చర్యలు తప్పవని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ తెలిపారు. బుధవారం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, లైసెన్సు సర్వేయర్లు, ఇంజనీర్లతో ఆమె సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ జీవో జారీచేసిందన్నారు. బిఆర్‌ఎఫ్‌, ఎల్‌ఆర్‌ఎఫ్‌ కింద దరఖాస్తు చేసుకొని క్రమబద్దీకరించుకోవాలన్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వీటితోపాటు భవనాలు, ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ కాకుండా ఉంటే వాటిపై చర్యలు చేపడుతున్నామన్నారు. వాటిని క్రమబద్దీకరించుకోకుంటే నీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు.

పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ మసూద్‌ అలీ, ఇన్‌చార్జి కమీషనర్‌ పఠాభి, రాహుల్‌, హరి, ఆర్‌ఐ నరేందర్‌, లైసెన్సు సర్వేయర్లు రాజు, సునీల్‌, గంగరాజ్‌, శ్రీనివాస్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోడు భూములు సాగుచేసుకోనివ్వాలి

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూముల‌ను సాగుచేసుకొనివ్వాల‌ని పట్టా పాస్‌ పుస్తకాలు ఇవ్వాల‌ని ...

Comment on the article