Breaking News

వచ్చే సీజన్‌కైనా చెరుకు సాగుచేయాలని ప్రోత్సహించాలి

 

బోధన్‌, డిసెంబరు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం నిజాంషుగర్‌ ఫ్యాక్టరీపై వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్‌చేస్తూ చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 15వ రోజుకు చేరుకున్నాయి.

ప్రభుత్వం అధికారంలోకి రాగానే బోధన్‌ చక్కర కర్మాగారానికి పూర్వవైభవం తెస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రస్తుతం ఫ్యాక్టరీపై తప్పుడు నిర్ణయాలు చేపట్టడంతో రైతులు, కార్మికులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఉండగా ఇతర ప్రయివేటు ఫ్యాక్టరీలకు చెరుకు తరలించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతప్రభుత్వాలు ప్రయివేటు యాజమాన్యాల మెడలు వంచైనా క్రషింగ్‌ కొనసాగించాయని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిందని బోదన్‌ ప్రజలు ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకున్నప్పటికి ప్రభుత్వం ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చూసి విస్తుపోతున్నారని అన్నారు. తెలంగాణ దీక్షల్లో అత్యధికంగా 1500 రోజులు దీక్షలు చేపట్టిన ఘనత బోదన్‌కు ఉందన్నారు. కానీ తెరాస ప్రభుత్వం ఎలాంటి కృతజ్ఞత చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్షల్లో బోదన్‌ మండలంలోని తగ్గెల్లి గ్రామ రైతులు పోశెట్టి, హరిసింగ్‌, రాజేందర్‌, బక్కన్న, గంగారాం, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రెండు వేల‌ జరిమానా విధించాలి

నిజామాబాద్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తారని, వ్యక్తి ...

Comment on the article