Breaking News

వసతి గృహాల నిర్వహణపై రిజిస్ట్రార్‌ సమీక్ష

 

డిచ్‌పల్లి, డిసెంబరు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వసతి గృహాల నిర్వహణపై రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.

న్యాక్‌ బృందం సందర్శన సందర్భంగా వసతి గృహాలు కల్సిస్తున్న సౌకర్యాలు, అభివృద్ది కార్యకలాపాలను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా వసతి గృహాల ప్రొఫైల్‌ పూర్తిచేసి విద్యార్థి, విద్యార్థిని పూర్తి సిబ్బంది సమాచారాన్ని కంప్యూటరైజ్‌చేసి బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు.

హాస్టల్స్‌, బిల్లుల నిర్వహణ, స్టోర్‌కు సంబంధించిన రికార్డులన్ని సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. ప్రతి హాస్టల్‌లో లైబ్రరీల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని సూచించారు. వసతి గృహాలకు సంబంధించి ప్రతి అంశాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించాలని తెలిపారు. సమావేశంలో చీఫ్‌ వార్డెన్‌ కొండ రవిందర్‌రెడ్డి, వార్డెన్లు మహేందర్‌, సంపత్‌, శాంతాబాయి, కేర్‌ టేకర్లు ఉన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Comment on the article