Breaking News

హట్టా – ఒమన్‌ చెక్‌పాయింట్‌ మూతపై కన్‌ఫ్యూజన్‌

హట్టా మీదుగా ఒమన్‌ మరియు యూఏఈ మధ్య రాకపోకలు నిర్వహించే ప్రయాణీకులు, చెక్‌పోస్ట్‌ మూసివేతపై ఆందోళనకు గురువుతున్నారు. షార్జా రూట్‌లో కల్బా మీదుగా వెళ్ళాలని తమపై ఒత్తిడి పెరుగుతోందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు.

ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సైతం ఈ అంశంపై పెదవి విప్పడంలేదు. వరుస సెలవులు వస్తుండడంతో భద్రతా కారణాల రీత్యా చెక్‌పోస్ట్‌ మూసి వేసి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హట్టా మీదుగా చేసే ప్రయాణంతో పోల్చితే షార్జా వైపు ప్రయాణం రెండు గంటలు అదనంగా ఉంటోందని ప్రయాణీకులు అంటున్నారు. కల్బా దారి, హట్టా దారితో పోల్చితే ఇబ్బందికరంగా ఉంటుందని, అధికారులు తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Check Also

‘బాత్రూంలో నీళ్లు తాగుతున్నా.. మీకు పుణ్యం ఉంటాది కాపాడండి సార్’

  నన్ను కాపాడి ఇండియాకు చేర్చండి సార్..: సౌదీలో తెలుగు మహిళ    దుబాయ్‌కి పంపుతామని చెప్పి ఏజెంట్ల చేతిలో ...

Comment on the article