Breaking News

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

 

బీర్కూర్‌, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మీర్జాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోగల వీరాపూర్‌ దుబ్బ గ్రామంలో బాల్య వివాహాన్ని శనివారం ఐసిడిఎస్‌ అధికారులు అడ్డుకున్నారు.

ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ వాణి కథనం ప్రకారం వీరాపూర్‌ గ్రామానికి చెందిన దత్తాత్రి రూప దంపతుల కుమార్తె అయిన సోని (15) అదే గ్రామానికి చెందిన శ్యాం సింగ్‌, పద్మ దంపతుల కుమారుడు జంపన్నతో ఆదివారం వివాహం జరగాల్సి ఉండగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శనివారం అడ్డుకున్నారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్ధాలను, వధువరుల కుటుంబాలకు వివరించారు.

అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండే వరకు వివాహాలు చేయవద్దని సూచించారు. అంతకుముందు పెళ్ళిళ్ళు చేస్తే చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు. మరో మూడు సంవత్సరాలు ఆగాలని సూచించారు. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి జంరు, ఏఎస్‌ఐ మజీద్‌ ఖాన్‌, గ్రామ పెద్దలు, తదితరులున్నారు.

Check Also

ఏదో ఒకరోజు గొప్పవ్యక్తి గాని సామాన్య వ్యక్తి గాని అక్కడికి వెళ్ళాల్సిందే

re నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విఐపి డెడ్‌ బాడీల‌కు ఏ విధంగా శవ యాత్ర నిర్వహిస్తారో అదేవిధంగా ...

Comment on the article