Breaking News

మనిషికి వైద్య పరీక్ష… మట్టికి నమూనా పరీక్ష తప్పనిసరి

 

నిజామాబాద్‌, డిసెంబరు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి రైతు తన భూమికి సంబంధించి మట్టి నమూనా పరీక్షలు తప్పకుండా చేయించాలని రాష్ట్ర విత్తనోత్పత్తి కమీషనర్‌, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వి.పార్థసారధి తెలిపారు. శనివారం కొత్త అంబేడ్కర్‌ భవన్‌లో ప్రపంచ భూసార పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి ఏరకమైన పంటలకు అనుకూలిస్తుందో, ఏ మేరకు రసాయన ఎరువులు వాడాలో పరిశీలించకుండా అదిక మొత్తంలో రసాయన ఎరువులను వినియోగిస్తూ పంటలు సాగుచేయడం వల్ల ఆ భూములు నిర్వీర్యమై బలాన్ని కోల్పోతాయన్నారు.

మనిషి అనారోగ్యానికి గురైతే ఏవిధంగా మందులు ఇస్తామో అదేవిధంగా మట్టి పరీక్షలు నిర్వహించి భూసారం మరింత బలోపేతం కావడానికి కూడా పరీక్షల ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. భూమి గురించి ఆలోచించకుండా అవసరానికి మించి రసాయన ఎరువులు ఉపయోగిస్తున్నారన్నారు. 4 పాళ్ళ నత్రజని, 2 పాళ్ళ భాస్వరం, ఒక పాలు పొటాష్‌ అవసరం కాగా అందుకు విరుద్దంగా 8 పాళ్ళ యూరియా, 3 పాళ్ళ భాస్వరం వాడుతున్నారని, తద్వారా భూమిలోని సారవంతం తగ్గిపోతుందన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకొకసారి భూసార పరీక్షలు చేయించుకొని అందుకనుగుణంగా పంటల సాగుకు, ఎరువుల వాడకానికి శ్రద్ద తీసుకోవాలని రైతులను కోరారు.

కలెక్టర్‌ యోగితారాణా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా భూసార పర్షీలు నిర్వహిస్తున్నారని, కేవలం అధిక యూరియా వాడకంతో పంటల సాగువల్ల భూమి సారవంతం కోల్పోతున్నామన్నారు. ప్రతి రైతు తప్పకుండా భూపరీక్షలు చేయించాలని, వాటి ఫలితాలను బట్టి వ్యవసాయధికారుల సలహా ప్రకారం పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతందన్నారు. సోమవారం కరువు బృందం జిల్లాకు వస్తుందని, రైతుల నష్టపరిహారానికై నివేదిక సమర్పించామని, వారు క్షేత్ర స్థాయిలో పర్యటించి కరువును పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి అందించే నివేదికతో కరువు సహాయం అందుతుందని అన్నారు.

కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *