Breaking News

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏడుగురు ఖరారు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీచేసే అభ్యర్థులను మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారుచేశారు. ఆదివారం తెలంగాణ భవనలో సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. కాగా నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో మొత్తం పన్నెండు మంది ఎమ్మెల్సీ అభ్యర్థులకుగాను ఏడుగురి పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్నివర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ చర్యలు తీసుకుంటుందని కేశవరావు వెల్లడించారు. ఎన్నికలు జరిగే 12 ఎమ్మెల్సీ స్థానాలలోనూ విజయం సాధించే మెజారిటీ టీఆర్‌ఎస్‌కు ఉందని కేకే పేర్కొన్నారు. కొన్నిజిల్లాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచేందుకు అవసరమైన బలం లేకపోయినా పోటీ చేస్తున్నారన్న వ్యాఖ్యలపై కేశవరావు స్పందిస్తూ ”ఎవరికి మెజారిటీ ఉందో ఎవరికి లేదో ఎన్నికల ఫలితాలు చెప్తాయి” అని అన్నారు. అభ్యర్థులను కొంటున్నారన్న ఆరోపణలపై మాట్లాడుతూ.. ”మేం అలాంటి తప్పు ఎప్పుడూ చేయం” అని అన్నారు. కాగా వరంగల్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కొన్నిస్థానాల్లో ఏకగ్రీవం కోసం తాము ప్రయత్నిస్తున్నామని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. కాంగ్రెస్‌తో ఏ విధమైన సర్దుబాట్లు చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇతర పార్టీల నేతలకు ప్యాకేజీల ఆశ చూపి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారన్న విషయంలో వాస్తవం లేదన్నారు. టీఆర్‌ఎస్‌లో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు సమన్యాయం జరుగుతుందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారన్న విషయమై.. తనకు పూర్తి సమాచారం లేదని కేకే తెలిపారు. 2 రోజుల్లో మిగతా ఐదు పేర్ల వెల్లడి 1.లక్ష్మీనారాయణ- ఖమ్మం 2.పురాణం సతీష్‌- ఆదిలాబాద్‌ 3. ఆర్‌.భూపతిరెడ్డి- నిజామాబాద్‌ 4. వి.భూపాల్‌రెడ్డి- మెదక్‌ 5. భానుప్రసాద్‌, 6. నారదాసు లక్ష్మణరావు (ఇద్దరూ కరీంనగర్‌) 7. తేరా చిన్నపరెడ్డి-నల్గొండ.

Check Also

గొప్ప పనులు చేస్తున్నారు

రాజన్న సిరిసిల్లా, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప పనులు ...

Comment on the article