Breaking News

8న ఎంబిసిల చలో హైదరాబాద్‌ గోడప్రతుల ఆవిష్కరణ

 

కామారెడ్డి, డిసెంబరు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత వెనకబడిన బిసి కులాలకు రిజర్వేషన్ల సాదన, బడ్జెట్‌ కేటాయింపుల కోసం ఈనెల 8న తలపెట్టిన ఎంబిసిల ఛలో హైదరాబాద్‌కు సంబంధించిన గోడప్రతులను సోమవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనకబడిన బిసి కులాల అభ్యున్నతి కోసం బిసి సబ్‌ప్లాన్‌ సాదన సమితి పాటుపడుతుందన్నారు. బిసి కులాల్లోని సంచార, చిరు వృత్తులు చేసేవారు పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బిసి ప్రతినిధులు క్యాతం సిద్దిరాములు, నర్సింగ్‌రావు, సతీష్‌, గంగన్న, మస్తాన్‌, షకీల్‌ తదితరులున్నారు.

Check Also

ప్రతి ఒక్కరు అల‌ర్ట్‌

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల‌ని ...

Comment on the article