Breaking News

బీర్కూర్‌లో పతంజలి యోగ శిబిరం

 

బీర్కూర్‌, డిసెంబరు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువు రాందేవ్‌బాబా ఆశీస్సులతో వారి శిష్యుడయిన గురు రఘువీర్‌ ఆధ్వర్యంలో బీర్కూర్‌లో పతంజలి యోగ శిబిరం కొనసాగుతుంది. ఇందులో భాగంగా సోమవారం 6వ రోజు ఉదయం 5 గంటల నుంచి 7.30 వరకు యజ్ఞము, యోగాసనాలు, ప్రాణాయామం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీర్‌ స్వామి మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భగవంతుని నామస్మరణతో మన పనులు చేసుకుంటూ భగవంతుని ఏవిధంగా ధ్యానం చేయాలో సూచించారు. చదువుతుండగా, వ్యవసాయం చేస్తుండగా, వ్యాపారం, ఉద్యోగం చేస్తుండగా భగవంతుని స్మరించవచ్చని అన్నారు. శ్వాసపై ధ్యాస ఉంచడమే ధ్యానమని, తద్వారా కలిగే ఉపయోగాలను ఆయన వివరించారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Comment on the article