Breaking News

పిఏకెఎస్‌ రాష్ట్ర మహాసభల గోడప్రతుల ఆవిష్కరణ

 

కామారెడ్డి, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13,14 తేదీల్లో హన్మకొండలో నిర్వహించనున్న పిఏకెఎస్‌ రాష్ట్ర మహాసభల గోడప్రతులను మంగళవారం కామరెడ్డిలో ఆవిష్కరించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అసంఘటితరంగ కార్మిక సంఘాల సమాఖ్య పిఏకెఎస్‌ రాష్ట్ర 2వ మహాసభలను హనుమకొండలోని ఆర్ట్స్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో తలపెట్టినట్టు చెప్పారు. సభలకు ప్రజాగాయకుడు గద్దర్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, తెలంగాణ జేఏసి ఛైర్మన్‌ కోదండరామ్‌తో పాటు పలువురు నాయకులు హాజరుకానున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రతినిదులు హనుమంత్‌గౌడ్‌, హనుమాన్‌చారి, మంగలి సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Comment on the article