Breaking News

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంలో తెవివి విద్యార్థుల ప్రతిభ

 

డిచ్‌పల్లి, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బుధవారం అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారంరోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో, సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో సన్మానించారు.

డిసెంబరు 5న తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్తులకు డిఎస్పీ చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. తెలుగులో పి.అశోక్‌, శ్రీకాంత్‌, ఎన్‌.తిరుపతి, ఇంగ్లీష్‌లో నాగార్జున, ఆర్‌.రాజ్‌కుమార్‌, అంబయ్య, హిందీలో మనోజ్‌, ప్రఫుల్‌, రేష్మ, ఉర్దూలో నస్రత్‌ బేగం, అస్మా తబస్సమ్‌, నాజియా బేగంవిజేతలుగా నిలిచారు. విజేతలైన విద్యార్థులను, నిర్వాహకులు డాక్టర్‌ త్రివేణిని వర్సిటీ విసి, రిజిస్ట్రార్‌లు అభినందించారు.

Check Also

కందకుర్తి శాఖా వార్షికోత్సవం

బోధన్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కందకుర్తి శాఖా వార్షికోత్సవాన్ని గురువారం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *