Breaking News

బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకుంటాం

 

కామారెడ్డి, డిసెంబరు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో డిసెంబరు 10న తలపెట్టిన బీఫ్‌ ఫెస్టివల్‌ను నిలిపి వేయాలని, లేకుంటే అడ్డుకొని తీరుతామని టిజివిపి జిల్లా అధ్యక్షుడు నవీన్‌ అన్నారు.

కామారెడ్డిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సరస్వతి నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని అసాంఘిక శక్తుల ప్రోద్బలంతో పాశ్చాత్య సంస్కృతి పోకడలను అనుసరిస్తూ బీఫ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి సిద్దమయ్యారన్నారు. భారతీయులు గోవును ఆరాధ్య దైవంగా పూజిస్తారని, ఇలాంటి కార్యకలాపాలను టిజివిపి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. డిసెంబరు 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం రోజున ఇలాంటి క్రూరమైన పండగను జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. దీన్ని రద్దుచేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో టిజివిపి ప్రతినిదులు అర్జున్‌, కార్తీక్‌, అఖిలేష్‌, సాయిదీప్‌, సూర్య, కొండల్‌రెడ్డి తదితరులున్నారు.

Check Also

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మాజీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *