Breaking News

గ్యాస్‌ లీక్‌ నలుగురికి గాయాలు

 

బాన్సువాడ, డిసెంబరు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని పిఎస్‌ఆర్‌ కాలనీలో ప్రమాద వశాత్తు గ్యాస్‌ లీకైన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.

శుక్రవారం ఉదయం వంట చేసే క్రమంలో గ్యాస్‌ రాకపోవడంతో ఇంటి యజమాని గ్యాస్‌ డీలర్‌కు సమాచారం అందించారు. గ్యాస్‌ సరఫరా కేంద్రంలో పనిచేసే కృష్ణ అనే కార్మికుడు వచ్చి గ్యాస్‌ను పరీక్షిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదం సంభవించి అక్కడేఉన్న కార్మికుడు కృష్ణతోపాటు గంగవ్వ, అంజవ్వ, గంగోత్రి అనే బాలికతో పాటు గంగవ్వ అనే మరోమహిళకు గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు బాధితులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలైన ఇద్దరిని హుటాహుటిన నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Check Also

రూ.1.51 కోట్లతో 30 రెండు పడక గదుల‌ ఇళ్ళు…

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండలం హంగర్గ గ్రామంలో ...

Comment on the article