Breaking News

హాస్టల్‌ వార్డెన్‌ను తొలగించాలి

 

బీర్కూర్‌, డిసెంబరు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ బాలుర వసతి గృహం వార్డెన్‌ స్వామిని తొలగించాలంటూ వసతి గృహ విద్యార్తులు తహసీల్దార్‌ ప్రసాద్‌కు శుక్రవారం సాయంత్రం విన్నవించుకున్నారు. కాస్మొటిక్‌ చార్జీలు సరైన సమయంలో అందజేయడం లేదని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం భోజనం అందించడం లేదని, చీటికి మాటికి విద్యార్తులపై కోపగించుకుంటూ కొడతారని విద్యార్తులు తహసీల్దార్‌ ముందు వాపోయారు. సంబంధిత విషయమై వార్డెన్‌ స్వామిని వివరణ కోరారు. ఇలాంటి విషయాలు పునరావృతమైతే జిల్లా సంక్షేమాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

వంట మనిషి బదిలీ హైడ్రామా

బీర్కూర్‌ బిసి బాలుర వసతి గృహంలో పనిచేసే వంటమనిషిని మద్నూర్‌ బిసి బాలుర వసతి గృహానికి బదిలీ ఉత్తర్వులు రావడంతో మండల కేంద్రంలో హైడ్రామా చోటుచేసుకుంది. వంట మనిషి జమీర్‌ తన బదిలీ ఉత్తర్వులను రద్దుచేయించాలని, వార్డెన్‌ స్వామి తనపై కక్షగట్టి విద్యార్థులతో అయిష్టంగా రాతపూర్వకంగా సంతకాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపించాడని ఆరోపిస్తూ వార్డెన్‌పై వాగ్వాదానికి దిగాడు. సంబంధిత విషయమై నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ జిల్లా సంక్షేమాధికారి విమలాదేవిని వివరణ కోరగా సదరు వంట మనిషి పై పలు ఆరోపణలు ఉన్నాయని, హాస్టల్‌లో సరిగా పనిచేయడంలేదని, గత కొన్ని రోజుల క్రితం వసతి గృహ వార్డెన్‌కు సమాచారం అందించకుండా పదిరోజులపాటు విదులకు రాలేదని తెలిపారు. జమీర్‌ను బాల్కొండకు బదిలీ చేయగా విధులకు హాజరు కాకపోవడంతో మద్నూర్‌కు బదిలీ చేశామని తెలిపారు. సంబంధిత విషయం తహసీల్దార్‌ ప్రసాద్‌ దృస్టికి వెళ్లగా విమలాదేవితో మాట్లాడి పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణమని, బదిలీ అయినచోట తప్పకుండా పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. తహసీల్దార్‌ రంగ ప్రవేశంతో హైడ్రామా వీగిపోయింది.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *