Breaking News

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

 

– ఎస్‌బిఐ బ్యాంకు ఎఫ్‌ఐసి మేనేజర్‌ రామేశ్‌

కామారెడ్డి, డిసెంబరు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందని, బ్యాంకింగ్‌ రంగంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌బిఐ బ్యాంకు ఎఫ్‌ఐసి మేనేజర్‌ రామేశ్‌ అన్నారు.

శుక్రవారం పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలో ఎస్‌బిఐ కస్టమర్‌ సర్వీస్‌ ప్యానల్‌లోని ఖాతాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రబుత్వం సురక్షా బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఈపథకం కింద సంవత్సరానికి 12 రూపాయలు ఇన్సురెన్సు చేసుకుంటే ప్రమాద బీమా రెండు లక్షల వరకు వర్తిస్తుందన్నారు. జీవన జ్యోతి పథకం కింద 330 రూపాయలతో ఇన్సురెన్సు చేసుకుంటే రెండు లక్షల బీమా సదుపాయం ఉంటుందన్నారు. అటల్‌ పింఛన్‌ పథకం కింద దరఖాస్తు చేసుకొని నిర్ణీత రుసుము కట్టుకుంటే 60 సంవత్సరాల తర్వాత పింఛన్‌ లభిస్తుందని తెలిపారు. ఖాతాదారులు అవకాశాల్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్వీస్‌ నిర్వాహకుడు రాజశేఖర్‌, ఖాతాదారులు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *