Breaking News

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

 

ఆర్మూర్‌, డిసెంబరు 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 23 వార్డుల్లో భూగర్భజలాలు తగ్గిపోయాయి. తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. పట్టణంలోని 23 వార్డులున్నాయి. కేవలం 9 నీటి ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నట్టు మునిసిపల్‌ కమీషనర్‌ సివిఎన్‌ రాజు తెలిపారు.

పట్టణంలో నీటి ఎద్దడి తీర్చేందుకు ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేసిందని, ఇందులోంచి 15 లక్షలను వాటర్‌ ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు కేటాయించామని, మరో 5 లక్షలు బోర్ల ఫిల్లింగ్‌ డిపెండింగ్‌ చేస్తున్నామని వివరించారు. పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నందున అదనపు నిదుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. ఆర్మూర్‌ పట్టణ ప్రజలు సైతం ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాలని పేర్కొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *