ఒక ప్రక్రియగా పొడుపుకథల గురించి ఆలోచిస్తూ ‘యక్షప్రశ్నలు’ మరొకసారి చదివాను. ఒక మహేతిహాసంలో ఆ సంఘటనని ఆ విధంగా conceive చేయగలగిన భారతకారుడి ప్రజ్ఞకు మరోసారి నిలువెల్లా నివ్వెరపోయాను. గొప్ప సాహిత్యం మనకి ప్రతి సారీ కొత్తగా కనిపించినట్టే, యక్షప్రశ్నలు కూడా మళ్ళా మరోసారి కొత్తగా కనిపించి కొత్త ఆలోచనలు నాలో సుళ్ళు తిరిగేయి. మహాభారతంలో యక్షప్రశ్నలతో వనపర్వం ముగిసిపోతుంది. అప్పటిదాకా కామ్యక వనంలో గడిపిన పాండవులు, ద్వైత వనానికి రాగానే ఒక బ్రాహ్మణుడు తన అరణి పోయిందని చెప్పడం, ఆ అరణి ని ...
Read More »Daily Archives: December 12, 2015
మాదిరి నాక్ టీంచే తెవివి విభాగాల పరిశీలన
డిచ్పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబరు 21,22,23 తేదీల్లో తెలంగాన యూనివర్సిటీకి నాక్ పరిశీలనా బృందం రానున్న నేపథ్యంలో శనివారం ముగ్గురు మాజీ విసిలతో కూడిన బృందం తెవివిలోని అన్ని విభాగాలను పరిశీలించింది. విసి సి.పార్ధసారధి, రిజిస్ట్రార్ ఆచార్య లింబాద్రితో పాటు మాజీ విసిలు ప్రొఫెసర్ అర్జుల రాంచంద్రారెడ్డి, ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ తిరుపతిరావులతో కూడిన బృందం వర్సిటీలోని వివిధ విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను, డాక్యుమెంట్లను, పబ్లికేషన్లు పరిశీలించి తగు సూచనలు చేశారు. ...
Read More »ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి భూపతిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికకు తెరాస అభ్యర్థి భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి, సంయుక్త కలెక్టర్ రవిందర్‌రెడ్డి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు 12వ తేదీ శనివారం చివరి రోజైనందున స్వతంత్ర అభ్యర్థి జగదీష్తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బరిలో తెరాస అభ్యర్థి మాత్రమే ఉన్నందున అతని ఎన్నిక ఏకగ్రీవమయిందని తెలిపారు. నామినేషన్లకు చివరి రోజు 9వ తేదీ వరకు తెరాస తరఫున భూపతిరెడ్డి, కాంగ్రెస్ తరఫున కె.వెంకటరమణారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ...
Read More »అందరితో కలిసున్నాం ఆదుకోండి….
ఎడపల్లి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జన జీవన స్రవంతిలో కలిస్తే జీవన భృతి కల్పిస్తామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హమిలతో లొంగిపోయిన తమకు ఇంతవరకు ఎటువంటి హమీలు అమలు చేయలేదని మాజీ నక్సలైట్లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ నక్స లైటు నాయకులు ఫేరోజ్ ఖాన్ అలియాస్ విజయ్‌కుమార్, ఆలకుంట రాములు మాట్లాడుతూ జన జీవనంలో కలిసి ఆర్థిక ఇబ్బందులతో కుంటుంబాలను పోషించుకుంటున్నామని ...
Read More »లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో కంటి వైద్య శిబిరం
ఎడపల్లి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని ధర్మారం, వడ్డపల్లి గ్రామాలలో శనివారం లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిభిరంతో పాటు, అంగన్ వాడి కేంద్రాలలో విద్యార్థులకు పలకలు పంపిణి చేశారు. కంటి వైద్య శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణి చేశారు. సుమారు 40 మందికి కంటి పరీక్షలు నిర్వహి ంచారు. అలాగే అంగన్వాడి విద్యార్థులకు పలకలు పంపిణి చేశారు .ఈ కార్యక్రమంలో మండల లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు పి.రాజలింగం, జోనల్ ...
Read More »లోక్ అదాలత్‌లో లయన్స్ సేవలు
బోధన్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో బోధన్ లయన్స్ క్లబ్ సభ్యులు సేవలందించారు. మెగా లోక్‌అదాలత్‌లో రాజీ ద్వారాసమస్యలు పరిష్కరించడానికి వచ్చిన వారికి లయన్స్ సభ్యులు పులిహోర ప్యాకెట్లు అందజేశారు. 600 వాటర్ ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎం.డి.మోహినోద్దీన్, కార్యదర్శి ప్రతాప్ గుప్త, సభ్యులు నర్సింహారెడ్డి, న్యాయవాది మధుసింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read More »అర్హులను డబుల్‌బెడ్ రూం ఇళ్ళ జాబితాలో చేర్చండి
బీర్కూర్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇల్ళ నిర్మాణ పథకంలో అర్హులైన లబ్దిదారులను విచారణ చేపట్టి గుర్తించి చేర్చాలని తహసీల్దార్ ప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో విఆర్వోలచే సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ పథకంలో అర్హులైన వారిని చేర్చాలని విఆర్వోలకు సూచించారు. ప్రస్తుతం రెవెన్యూ గ్రామ సభల్లో పౌతీ పట్టాలను ఇస్తున్న సందర్భంగా వచ్చిన ఆర్జిలను నిశితంగా ...
Read More »చక్కర ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి
బోధన్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చక్కర కర్మాగారాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీన పరుచుకొని నడపాలని డిమాండ్ చేస్తూ శనివారం నాటికి దీక్షలు 25వ రోజుకు చేరుకున్నాయి. పిడిఎస్యు జిల్లా నాయకులు గౌతంకుమార్ దీక్ష శిబిరాన్ని సందర్శించారు. దీక్షలో విద్యార్థి సంఘం నాయకులు కూర్చున్నారు. బోధన్ అక్కినేని యువజన సంఘం అధ్యక్షుడు గంగాప్రసాదప్ప సంఘీభావం తెలిపారు.
Read More »హాస్టల్లో సరిగా పనిచేయకపోతే చర్యలు
బీర్కూర్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్షేమ వసతి గృహాల్లో సరిగా పనిచేయని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారిణి విమలాదేవి అన్నారు. మండల కేంద్రంలోని బీర్కూర్ బాలుర వసతి గృహాన్ని శనివారం తహసీల్దార్ ప్రసాద్‌తో కలిసి ఆమె ఆకస్మికంగా తనికీ చేశారు. వసతి గృహ విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వార్డెన్‌ను తొలగించాలని విద్యార్థులు తహసీల్దార్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై వార్డెన్ పనితీరు గురించి విద్యార్థులను ప్రశ్నించారు. నైట్‌వాచ్‌మెన్ గణేశ్‌ను, ...
Read More »25వ రోజుకు చేరిన దీక్షలు
బోధన్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాం షుగర్‌ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలంటూ చేపట్టిన దీక్షలు శనివారం నాటికి 25వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడుపుతామని చెప్పి ప్రస్తుతం తెరాస ప్రభుత్వం కార్మికులకు, కర్షకులను నట్టేట ముంచిందని పిడిఎస్యు జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫ్యాక్టరీలోని మిషనరీ తుప్పు పట్టకుండా వెంటనే మరమ్మతులు చేయించి వచ్చే సీజన్లోనైనా ప్రభుత్వ ఆధీనంలో నడిచేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలో ప్యాక్టరీ కార్మికులు షేక్‌బాబు, ...
Read More »బ్రాహ్మణులంటే ఎవరు?
నువ్వెవరివి? అని అడుగుతే తాను ఎవరో-ఏంటో, చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు నేటి బ్రాహ్మణులు. బ్రాహ్మణ ఔన్నత్యాన్ని, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏమాత్రం తెలియని అనేకమంది తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే రోజులొచ్చాయి. బ్రాహ్మణ విమర్శకులు, ”ఓహో…బ్రాహ్మణులంటే ఇంత గొప్పవారా? వీళ్లకు ఇంత తెలుసా? బ్రాహ్మణులకి ఇంత విస్తారమైన చరిత్ర వుందా? వీరిని బాపనోడు, బామ్మడు, పంగనామాలోడు అని హేళన చేయవచ్చా?” అన్న ఆలోచన కలుగజేయాలి. హైందవ మతానికి, లేదా వైదిక మతానికి ఒక ప్రత్యేకత వుంది. వాల్మీకి రామాయణం రాసే ...
Read More »