Breaking News

బడిలో చేరిన బాలకార్మికులు

 

భీమ్‌గల్‌, డిసెంబరు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటుక బట్టిలో పనిచేస్తున్న ఆరుగురు బాల కార్మికులను సోమవారం లింగాపూర్‌పిఎస్‌ పాఠశాలలో చేర్పించడం జరిగిందని ఎంఇవో డి.స్వామి అన్నారు.

బడిబయటి పిల్లలను బడిలో చేర్పించాలనే కలెక్టర్‌ ఆదేశాల మేరకు బాల కార్మికులుగా ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఈఓపిఆర్‌డి లక్ష్మినర్సింహాచారి, ఏశాలకృష్ణ, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్‌, సిఆర్‌పిలు బాలరాజు, ఝాన్సీ, ఎస్‌ఎంసి పావన్న, పాఠశాల సిబ్బంది భోజన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌ బారినపడి మైల్డ్‌ సింప్టమ్స్‌ కలిగి ...

Comment on the article