Breaking News

విద్యార్థులు క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదగాలి

 

కామారెడ్డి, డిసెంబరు 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం సాధించి గ్రామ స్తాయి నుంచి జాతీయ స్తాయికి ఎదగాలని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం గిద్ద గ్రామంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం, క్రీడాకారులకు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరై డిఎస్పీ మాట్లాడారు.

గ్రామీణ క్రీడాకారులు తమ నైపున్యానికి సానబెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ ద్వారా ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. తద్వారా ప్రజలకు వైద్యం అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. క్రీడాకారులకు సామగ్రి పంపినీ చేసి వారికి చేయూతగా నిలిచేందుకు దోహదపడుతున్నామన్నారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ ప్రతినిది రాజ్‌కుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్యాంగోపాల్‌, రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు, తదితరులున్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article