Breaking News

ప్రమాదంలో హిందూమతం

హిందూ మతాన్ని నాశనం చెయ్యడానికి రెండు వర్గాలు పోటీపడుతున్నాయి. ఒకరు కుటుంబ నియంత్రణ అవసరం లేదనీ, ఎందరినైనా కని తమ మతాన్ని వ్యాప్తిచేయమని చెబుతుండగా, మరి ఇంకో మతం ప్రలోభాలకు గురిచేస్తూ మా మతానికి రండి.. ఫీజులు కట్టనవసరం లేదు. డబ్బులు ఇస్తాం. ఉపాధి కల్పిస్తాం. పాపాలన్నీ క్షమింపజేస్తాం అంటూ ఎన్నికల పోటీలాగా ప్రచారం చేస్తున్నది. హిందూ ధార్మిక సంస్థలు మాత్రం ఏమీ పట్టనట్టు ఉన్నాయి. దౌర్జన్యం చెయ్యడం సనాతన ధర్మం అభిమతం కాదు.

హిందూ సంప్రదాయం ప్రతీ హిందూ వ్యక్తి పాటించాలి. పండుగలు, వ్రతాలు, పూజలు బహిరంగంగా జరగాలి. ప్రతీ దేవాలయంలో హిందూ ధార్మిక ప్రసంగాలు జరగాలి. ప్రతీ హిందూ వ్యక్తి మత ప్రచారం చెయ్యాలి. మిగతా మతాలను గౌరవించాలి. – కె.వి.ప్రసాద్, విశాఖపట్నం హెల్మెట్‌పై నిర్బంధం వద్దు గతంలోనే కొంతమంది మేధావులు హెల్మెట్ నిర్బంధం చేయవద్దు ఐచ్ఛికం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చారు. కారణం హెల్మెట్ వుంటే తల ముఖం మీద దెబ్బలు తగలకుండా ప్రాణం పోకుండా కాపాడుతుంది. కాని కాళ్లుచేతులు నడుము గుండె ఊపిరి తిత్తులు కడుపు భాగాలకు తీవ్రమైన గాయాలు తగిలి దుర్భరమైన నరకయాత అనుభవించక తప్పదు.

హెల్మెట్ బరువు ఎక్కువసైజు, ఇబ్బందులు ఎక్కువ. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్మెట్ నిబంధన సడలించాలి. ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు నచ్చచెప్పాలి. – గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ ప్రతి స్కూలుకూ లైబ్రరీ ప్రతి పాఠశాలకి ఓ గ్రంథాలయం ఉండాలి. వివిధ పుస్తకాలతో గ్రంథాలయం నిండి వుండాలి. సైన్సు పుస్తకాలు, వివిధ కథల పుస్తకాలు ఉండాలి. పాఠశాలకి గ్రంథాలయం పునాది వంటిది. కేవలం క్లాసు పుస్తకాల బోధనవల్ల చదువు యాంత్రికమైపోతుంది. రోజుకి కనీసం రెండు గంటలు పుస్తక పఠనానికి కేటాయించాలి. గ్రంథాలయంలో ఎటువంటి బలవంతం ఉండకూడదు. విద్యార్థులు తమకు నచ్చిన పుస్తకాలు తీసుకుని చదవచ్చు. ఇకమీదట గ్రంథాలయం ప్రతీ పాఠశాలకు అనివార్యం చెయ్యాలి. విశాలమైన గదుల్లో కుర్చీలు, బల్లలు ఏర్పాటుచేసి గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలి. – ఎం.సుధాకర్, విశాఖ జిల్లా దేశభక్తికి అర్థం మారుతోందా? దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అన్నారు పెద్దలు. కాని మన సెక్యులర్ పిచ్చివాళ్లు విదేశాల్ని ప్రేమించుమన్నా, విద్వేషాలు పెంచుమన్నా అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఏ చానల్ చూసినా, ఏ పేపర్ చదివినా నిజానిజాలతో నిమిత్తం లేకుండా భావస్వేచ్ఛ ఏ స్థాయిలో పేట్రేగిపోతున్నదో కనిపిస్తుంది. విదేశాల్లో కూడా ఇంత విశృంఖల స్వేచ్ఛ లేదనిపిస్తుంది.

విదేశీ ఛానల్స్ చూస్తే ఈ సంగతి తెలుస్తుంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, పశ్చిమ బెంగాల్ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో గోవధ నిషేధించినా చట్టాన్ని ధిక్కరించి గొడ్డు మాంసం తినడం దేశ భక్తి అన్నట్టు చెలరేగిపోవడం విడ్డూరమే. – సోనాలి, సూర్యారావుపేట సెట్‌టాప్ బాక్సుల అవసరమెంత? ఎపిలోని గ్రామసీమల్లో టి.వి. ఉపయోగం విపరీతంగా పెరుగుట గమనార్హం. పేద, మధ్యతరగతి ప్రజానీకం కష్టపడి కొన్ని గంటలపాటు టి.వి. కార్యక్రమాలతో సేదతీరుతారు. 90% జనాభాకు టి.విలు వున్నాయి. కాని ఇటీవల భారమైన సెట్‌టాప్ బాక్సులను అమర్చుకోవాలని కేబుల్ ఆపరేటర్లు వత్తిడి చేస్తున్నారు. అట్లా చేయకపోతే కొన్ని చానల్ ప్రసారాలు నిలుపుచేయిస్తున్నారు. కనుక ప్రభు త్వం జోక్యం చేసుకొని సెట్‌టాప్ బాక్సుల అమరికపై తగు చర్య తీసుకోవాలి. – కె.విమల, గరికపర్రు ఆత్మహత్యలు వద్దన్నా! ఆరుగాలం శ్రమించే ఓ రైతన్నా! మా రైతన్నా మీకు ఆత్మహత్యలే శరణ్యం అయినయి గదన్నా తెలంగాణ వస్తే రైతన్నల ఆత్మహత్యలు లేవనుకున్నామన్నా! గిదేందన్నా! ప్రతి రోజూ పిట్టల్లా రాలిపోతున్నారు గదన్నా మొన్న లింబన్న, నేడు మల్లేషన్నలు రాజధాని కేంద్రంలోనే తనువు చాలించారుగదన్నా రైతన్నా! ఆత్మహత్యలు చేసుకోవద్దన్నా పచ్చని పంట పొలాలలో మరణ మృదంగం మ్రోగనీయకన్నా కష్టించి, బతికి సాధించాలన్నా చావు పరిష్కారం కాదన్నా మీ ఆత్మహత్యలతో తెలంగాణ తల్లి ఎక్కెక్కి ఏడుస్తుందన్నా మీకు చేతులు జోడించి మొక్కుతున్నామన్నా రైతన్నలారా! ఆత్మహత్యలు వద్దన్నా – సయ్యదా సమీనా పర్వీన్, కరీంనగర్ టౌన్ పెట్రోలు ధరల భారం పెట్రోలు దేశాలు ఉత్పత్తిచేసి మన దేశానికి ఏ విధంగా సప్లయి చేస్తున్నాయో ప్రజలెరుగనిది కాదు. సెస్సులు, పన్నులు వగైరా విధించి ప్రజలకు ఏ రేటుకు పెట్రోలు, డీజిల్, కిరసనాయిలు తదితరాలు పెంచి ఇస్తున్నారో గణాంకాలు చూస్తే మతిపోతుంది. ఈ రకమైన తమ దోపిడికి స్వస్తిచెప్పకపోతే ప్రజలు భవిష్యత్తులో గుణపాఠం చెప్పక మానరని పెట్రోలు కంపెనీలు, ప్రభుత్వం గమనిస్తే మంచిది.

– పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

Check Also

జాతివివక్షలా? జాత్యహంకారమా?

US అగ్రరాజ్యంలో జాతివివక్షకు బీజం పడిందా? కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ చేపట్టిన విధివిధానాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నా యా?కేవలం అమెరికాఫస్ట్‌ ...

Comment on the article