Breaking News

ఏటీఎంలపై బీహార్, మహారాష్ట్ర ముఠాల కన్ను

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోగల ఏటీఎంలపై బీహార్, మహారాష్ట్రలకు చెందిన బడా గ్యాంగ్‌ల కన్ను పడింది. ఇప్పటికే ఐదు ఏటీఎంలను ఈ గ్యాంగ్‌లు పగులగొట్టి లక్షలాది రూపాయలను అపహరించారు.

ప్రధానంగా నేషనల్ హైవే పక్కన ఉన్న ఏటీఎంలను ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకుని చోరీ చేస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వర్నీ, కోటగిరిలలోగల ఏటీఎంలను గ్యాస్ కట్టర్‌లతో కట్ చేసి నగదను తస్కరించారు. తాజాగా మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోగల టాటా ఇండికాం ఏటీఎంను పగులగొట్టి అందులో ఉన్న రూ. 3.20లక్షలను ఎత్తుకెళ్లారు. వరుసగా జరుగుతున్న సంఘటనలతో పోలీసులు అప్రమత్తమైనా… ఈ ముఠాల జాడ మాత్రం తెలియడం లేదు. అలాగే సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలలోకి వీరు రాత్రివేళల్లో చొరబడి సీసీ కెమేరాలను ధ్వంసం చేసి గ్యాస్ కట్టర్లతో మిషన్లను కట్ చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా తేలిక కానప్పటికీ పెద్ద పెద్ద ముఠాలే ఈ తరహాఘటనలకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా… నిజామాబాద్ జిల్లా వర్నీ, కోటగిరిలలో చోరీ జరిగిన ఏటీఎం కేంద్రాలను ఐజీ నవీన్‌చంద్ బుధవారం పరిశీలించారు.

Check Also

డయల్‌ 100ను నిర్భయంగా ఉపయోగించుకోవాలి

నందిపేట్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నందిపేట్‌ మండలకేంద్రంలోని మోడల్‌ కళాశాలలో ఆడపిల్లకు తమ ...

Comment on the article