Breaking News

అర్హులందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు

 

– మంత్రి పోచారం

బీర్కూర్‌, డిసెంబరు 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అర్హులందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళ నిర్మాణం చేపడతామని రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రిపోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని దుర్కి గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేపట్టలేదని, పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్‌ బెడ్‌ రూం ఇల్ళ నిర్మాణం అందిస్తున్నామన్నారు.

లబ్దిదారుల నుంచినయాపైసా రికవరి ఉండదని ఆయన అన్నారు. రాబోవు రెండేళ్లలో వాటర్‌ గ్రిడ్‌ నిర్మాణం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి వ్యక్తికి 100 లీటర్ల చొప్పున స్వచ్చమైన నీటిని అందిస్తామన్నారు. అర్హులైన బీడీ కార్మికులను గుర్తించి వారి కొరకు లబ్దిదారుల సొంత గ్రామంలోనే భూమిని సేకరించి అవసరమైతే నగదుతో స్థలాన్ని కొనగోలు చేసి ప్లాట్లు పంచుతామని అన్నారు. కార్యక్రమంలో మండల తెరాస అధ్యక్షులు పెరిక శ్రీనివాస్‌, ఎంపిపి మల్లెల మీణ హన్మంతు, జడ్పిటిసి కిషన్‌నాయక్‌, గ్రామ సర్పంచ్‌ మోహన్‌, మైలారం సహకార సంఘం అధ్యక్షుడు అప్పారావు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆ రెండు క‌ల్లు దుకాణాల‌తో కష్టాలు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర ప్రజల‌కు అసౌకర్యం కలిగిస్తున్న క‌ల్లు దుకాణం ఇక్కడి ...

Comment on the article