విశ్రాంత ఉద్యోగులు అవిశ్రాంత శ్రామికులు

 

– ఎటివో మస్తాన్‌రావు

కామారెడ్డి, డిసెంబరు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్రాంత ఉద్యోగులు అవిశ్రాంత శ్రామికులని కామారెడ్డి ఎటివో మస్తాన్‌రావు అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్స్‌డే ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మస్తాన్‌రావు మాట్లాడారు. పదవీ విరమణ పొందినప్పటికి విశ్రాంత ఉద్యోగులు అవిశ్రాంతంగా అన్నింట్లో పాల్గొంటూ సమాజానికి తమవంతు సేవలు అందించడాన్ని కొనియాడారు.

అనంతరం పెన్షనర్స్‌డే పోటీల్లో పాల్గొని విజేతలైనవారికి బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ఏవో నారాయణ, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌రావు, ప్రతినిదులు వెంకటి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల భద్రత కోసం నా భద్రత నా పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *