Breaking News

నాక్‌ గుర్తింపు కోసం విద్యార్థులు సహకరించాలి

 

– విసి పార్థసారధి

డిచ్‌పల్లి, డిసెంబరు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాక్‌ గుర్తింపు కోసం యూనివర్సిటీ చేస్తున్న ప్రయత్నాల్లో విద్యార్థులు మమేకం కావాలని వైస్‌ చాన్స్‌లర్‌ సి.పార్థసారధి పిలుపునిచ్చారు. శనివారం కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాల సెమినార్‌ హాల్‌లో నాక్‌ బృందం రాక నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

నాక్‌ గుర్తింపుఅనేది విద్యార్థుల పట్టాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, వర్సిటీకి కొత్త గుర్తింపునిస్తుందని అందరూ విద్యార్థులు తమ శాయశక్తులా కృసి చేయాలన్నారు. విద్యార్తులు చదువుతున్న తమ సంస్థకు నాక్‌ ద్వారా మంచి గ్రేడింగ్‌ వచ్చేలా తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. నాక్‌ గ్రేడ్‌ రావడంలో విద్యార్థులది కీలక భూమిక అని తమ విభాగాలలో వారిది చురుకైన పాత్ర ఉండాలని విసి కోరారు. రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు దృస్ట్యానే నాక్‌ గుర్తింపు కోసం కృసి చేస్తున్నామని వివరించారు. విద్యార్థులకు నాక్‌ గుర్తింపు ఉన్న సంస్థలో చదివితే మరింతగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందన్నారు.

కమిటీలతో సమీక్ష

విసి పార్థసారది నాక్‌ కోసం నియమించిన వివిధ కమిటీల ప్రతినిదులతో, వారి ఏర్పాట్లపై సమీక్షించారు. వారి సన్నద్దతతను అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాలను స్వయంగా తనికీ చేశారు. ఇందులో రిజిస్ట్రార్‌, డీన్‌లు పాల్గొన్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *