Breaking News

ఘనంగా దత్తజయంతి వేడుకలు

 

ఎడపల్లి, డిసెంబరు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఠానాకలాన్‌ గ్రామంలో గురువారం దత్తజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి చిత్రపటం గ్రామంలో పలు వీధుల గుండా పల్లకిలో ఊరేగించారు.

దత్తాత్రేయ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తజయంతి సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ అబ్బయ్య, ఎంపిటిసి సభ్యుడు ఆకుల సురేశ్‌, సింగిల్‌ విండోఛైర్మన్‌ సాయికుమార్‌, గ్రామ పెద్దలు, గణపతిరెడ్డి, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *