Breaking News

పెరియార్‌ రామస్వామి వర్ధంతి వేడుకలు

 

మోర్తాడ్‌, డిసెంబరు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌లో గురువారం పెరియార్‌ రామస్వామి 42వ వర్ధంతిని అంబేడ్కర్‌ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. రామస్వామి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.

ఈసందర్భంగా వారుమాట్లాడుతూ దేశంలో సమసమాజ స్థాపనకు, అందరికి విద్య కోసం, అంటరానితన నిర్మూలన కోసం ఎంతో కృసి చేశారని వారు కొనియాడారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయా సాదనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ సంఘ సభ్యులు మామిడిరాజేశ్వర్‌, మల్లూరి రాజారాం, రవి, సామ్రాట్‌ అశోక్‌, మామిడి గంగాధర్‌, కుర్మల గంగాధర్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *