Breaking News

తెరాసలో చేరిన తిరుపతి

 

నందిపేట, డిసెంబరు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి సీనియర్‌ నాయకుడు నందిపేట వాస్తవ్యుడు ఎస్‌.జి. తిరుపతి గురువారం హైదరాబాద్‌ వెళ్ళి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు.

అతనితో పాటు అనుచరులు పెద్ద సంఖ్యలో తెరాసలో చేరారు. తిరుపతి సర్పంచ్‌ ఎన్నికల్లో ఎం.డి.షాకీర్‌పై పోటీచేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందారు. తిరుపతి చేరికతో తెరాస మండలంలో మరింత బలపడుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి తన సొంత డబ్బుతో గతంలో మినీ ట్యాంకులు నిర్మించారు. ఈ సంవత్సరం నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని సొంత ట్రాక్టర్‌ ద్వారా ఇంటింటికిఉచిత నీటి సరపరాచేస్తున్నారు. ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకోవడం, ప్రజా సమస్యలపై, అవినీతిపై పోరాడే సామాజిక కార్యకర్తగా పేరున్న తిరుపతి తెరాసలో చేరడం గర్వకారణంగా ఉందని అంటున్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *