Breaking News

ఘనంగా బారడి పోచమ్మ పండగ

 

బోధన్‌, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలో బారడి పోచమ్మ పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. భాజా, భజంత్రీలతో మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని అమ్మవారికి తరలివచ్చారు.

ఇంటిల్లిపాది అమ్మవారి కరుణ కటాక్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిండి పదార్థాలు, తీపి వంటకాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి సామూహిక భోజనాలు చేశారు. కుటుంబ సభ్యులను, గ్రామస్తులను చల్లగా చూడాలని,సుఖ శాంతులతో వర్ధిల్లాలని మొక్కుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగాధర్‌ దేశాయ్‌, హౌజిరావు దేశాయ్‌, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *