Breaking News

మద్యం సిట్టింగ్‌లకు పాల్పిడితే దాబాలను సీజ్‌ చేస్తాం

 

మోర్తాడ్‌, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ జాతీయ రహదారిపైగల దాబాల్లో మద్యం సిట్టింగ్‌లకు పాల్పడవద్దని మోర్తాడ్‌ ఎస్‌ఐ శనివారం దాబాలను సందర్శించి యజమానులను ఆదేశించారు.

దాబాల్లో మద్యంసిట్టింగ్‌లకు పాల్పడవద్దని, గ్రామాల్లో సైతం దాబాలు ఏర్పాటు చేసి మద్యం సిట్టింగ్‌లకు పాల్పడితే సీజ్‌చేస్తామని ఎస్‌ఐ అశోక్‌రెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలో జరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు ముందస్తుగా దాబా యజమానులను హెచ్చరించినట్టు ఎస్‌ఐ వివరించారు. ఎవరు ఎంతటి వారైనా మద్యంసిట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని అన్నారు.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *