Breaking News

అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత

 

ఆర్మూర్‌, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసిఎం వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న ఆవులను ఆర్మూర్‌ పట్టణ బిజెపి, బిజెవైఎం, శివసేన, భజరంగ్‌దళ్‌ నాయకులు శనివారం పట్టుకొని ఆవులను సిద్దులగుట్టపై గల గోశాలకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోవులను అక్రమంగా తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదని వారుతెలిపారు. కార్యక్రమంలో బిజెవైఎం పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్‌, నాయకులు ద్యాగ ఉదయ్‌, రాము, గోపి, కిషన్‌, శ్రీధర్‌, తదితరులున్నారు.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *