Breaking News

మగాడిపై ఆడోళ్ల అత్యాచారం.. వీర్యం సేకరణ..

దక్షిణాఫ్రికా : ఆడోళ్లపై అత్యాచారం చేయడం చూశాం.. కానీ దీనికి విరుద్ధంగా మగాడిపై ముగ్గురు ఆడోళ్లు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా అతడి వీర్యాన్ని సేకరించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని పోర్టు ఎలిజబెత్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రోడ్డుపై వెళ్తున్న 33 ఏళ్ల వ్యక్తిని బీఎండబ్ల్యూ కారులో వచ్చిన మహిళలలు బలవంతంగా ఎక్కించుకున్నారు. కారులోకి లాగిన తర్వాత అతడికి తెలియని పదార్థం ఇచ్చారు.

ఇక ముగ్గురు వేర్వేరుగా అతనిపై అత్యాచారం చేసి వీర్యాన్ని సేకరించారు. వీర్యాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌ల్లో సేకరించి చల్లని బాక్స్‌లో నిల్వ ఉంచినట్లు బాధితుడు తెలిపారు. ఇక 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం తనను కారు నుంచి దింపేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు. పోలీసులు మాట్లాడుతూ.. బాధితుడు ఇప్పటికీ భయపడుతూనే ఉన్నాడు. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. వినలేదు. అంతా గందరగోళంగా ఉందని తెలిపారు.

Check Also

చిరుత దాడి…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జానకంపేట్‌ గ్రామశివారులోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *