Breaking News

పిడిఎస్‌యు డివిజన్‌ మహాసభలను జయప్రదం చేయాలి

 

కామారెడ్డి, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో ఈనెల 30న జరిగే పిడిఎస్‌యు 3వ డివిజన్‌ మహాసభలను విజయవంతం చేయాలని పిడిఎస్‌యు డివిజన్‌ ఉపాధ్యక్షుడు డి.సురేశ్‌ కోరారు.

పిడిఎస్‌యు స్తానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాస్త్రీయ విద్యాసాధన లక్ష్యంగా విద్యార్థి సమస్యలను పరిష్కరిస్తూ పిడిఎస్‌యు పోరాడుతుందన్నారు. భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన కోసం మహాసభలు నిర్వహించనున్నామన్నారు. దేశంలో ఉన్నకార్పొరేట్‌ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యా రక్షణే ధ్యేయంగా పిడిఎస్‌యు పోరాటాలు చేస్తుందన్నారు. కెసిఆర్‌ ఇచ్చిన కెజి నుంచి పిజిఉచిత విద్య హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహాసభలకు డివిజన్‌లోని పిడిఎస్‌యు ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో నరేశ్‌, శేఖర్‌, విఠల్‌, సురేశ్‌, ఇమ్రాన్‌ తదితరులున్నారు.

Check Also

రక్త హీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సుజాత అనే మహిళ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *