Breaking News

ఎడపల్లి బస్టాండ్‌ను పరిశీలించిన ఆర్టీసి డిఎం

 

ఎడపల్లి, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనుగడలేని ఆర్‌టిసి బస్టాండ్‌ను పునరుద్దరించేందుకుగాను బోధన్‌ డిపో మేనేజర్‌ భవభూతి శనివారం గ్రామ పంచాయతీ సహకారంతో పారిశుద్య సిబ్బంది ద్వారా ఎడపల్లి కొత్తబస్టాండ్‌ పరిసరాలను శుభ్రం చేయించారు.

బస్టాండ్‌ ఆవరణలో ముళ్ల పొదలు, చెత్త, చెదారం పేరుకుపోవడంతో బస్టాండ్‌ దుర్బరంగా మారింది. దీంతో మూడురోజుల క్రితం డిప్యూటి సిటిఎం బస్టాండ్‌ను తనిఖీ చేసి పునురుద్దరించేందుకు చర్యలు చేపట్టాలని డిఎంను ఆదేశించడంతో పనులు ప్రారంభించినట్టు మేనేజర్‌ పేర్కొన్నారు. త్వరలో బస్టాండ్‌లో మొరంతో చదునుచేయించి బస్సులు బస్టాండ్‌లోకి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *