Breaking News

మొరం టిప్పర్‌ బోల్తా – వ్యక్తి మృతి

 

ఎడపల్లి, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం బ్రాహ్మణ్‌పల్లి గ్రామంలో చెరువుకట్టపై నుంచి మొరం టిప్పర్‌ బోల్తాపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ ఎం.డి.

హసీఫ్‌ కథనం ప్రకారం… వర్ని మండలం రుద్రూర్‌ గ్రామానికి చెందిన కర్రోల్ల తులసి ప్రసాద్‌ (33) శనివారం ధూపల్లి – రెంజల్‌ రోడ్డును మొరం పనులు జరుగుతుండగా టిప్పర్‌లో కూర్చున్న ప్రసాద్‌ చెరువు కట్టపై టిప్పర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో టిప్పర్‌ కింద ఇరుక్కుపోయి ప్రసాద్‌ అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. సంఘటన స్థలానికి సర్పంచ్‌ పుష్ప, ఎంపిటిసి ప్రమీల సందర్శించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ అన్నారు.

Check Also

ప్రభుత్వ సూచన మేరకు రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సూచన ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *