Breaking News

బాలయ్య ఫ్యాన్స్ కు షాక్ న్యూస్..

సంక్రాంతి ఎప్పుడు వస్తుందా..బాలయ్య బాబు నటించిన డిక్టేటర్ ఎప్పుడెప్పుడు చూద్దామని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు షాక్ న్యూస్ వినబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. బాలకృష్ణ 99వ చిత్రం డిక్టేటర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సంగతి తెల్సిందే. లయన్ పరాజయం చెందడంతో ఎలాగైన డిక్టేటర్ తో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్న బాలయ్య కు ఎన్టీఆర్ , నాగార్జున రూపం లో ఎదురు దెబ్బ తగలనుంది.. వీరు నటించిన సోగ్గాడు చిన్ని నాయానా , నాన్నకు ప్రేమతో ఈ రెండు చిత్రాలు కూడా సంక్రాంతికి రిలీజ్ కానుండడం తో డిక్టేటర్ కు కలెక్షన్స్ పరంగా , థియేటర్స్ పరంగా కూడా నష్టం వాటిల్లనుంది..దీంతో బాలకృష్ణ ఒక్క అడుగు వెనక్కు వేసి సంక్రాంతి బరి నుండి తప్పకుబోతున్నాడని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు..

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *