Breaking News

చలి బాబోయ్… చలి…

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్‌లో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణం మారిపోయింది. చలికాలం మొదలై చాలాకాలం అయినప్పటికీ గురువారం వరకు పెద్దగా చలిగా అనిపించలేదు.

శుక్రవారం నుంచి చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. చీకటి పడగానే పెరిగిన చలిలో జనం ఇళ్ళకే పరిమితమయ్యారు. వివిధ పనుల మీద హైదరాబాద్‌కి వచ్చినవారికి సరైన ఆశ్రయం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. బస్టాండుల్లో, ఆస్పత్రుల వద్ద జనం అవస్థ వర్ణనాతీతంగా వుంది. పారిశుద్ధ్య కార్మికులు చలిలో వణుకుతూనే నగరంలో రోడ్లు శుభ్రం చేశారు. ఉత్తర భారత దేశం నుంచి తెలంగాణ వైపు చల్లటి గాలులు వీస్తున్నాయని, అందుకే చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మరో పదిరోజులపాటు చలి తీవ్రత ఇలాగే వుండే అవకాశం వుందని చెబుతున్నారు. నిజామాబాద్, రామగుండాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతక 13 డిగ్రీలకు చేరింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చలి పెరిగింది. విశాఖ మన్యంలో చలిగాలుల తీవ్రత పెరగడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. శనివారం ఉదయం మినుములూరులో 6, లంబసింగిలో 7, పాడేరులో 8, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Check Also

నేడు, రేపు మంటలే

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్‌లో ఆదివారం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో మార్చి నెల పగటి ఉష్ణోగ్రతల్లో ...

Comment on the article