Breaking News

ఖాళీ బిందెలతో మహిళల ధర్నా

 

మోర్తాడ్‌, డిసెంబరు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఏర్గట్ల గ్రామంలోగల గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో శనివారం దర్నా నిర్వహించారు.

తాగునీటి ఎద్దడి తీవ్రంగా నెలకొందని, సర్పంచ్‌ పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అదికారి సైతం మండలాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ముందస్తుగా తాగునీటి కోసం చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *