Breaking News

మోర్తాడ్‌లో మల్లన్న జాతర – అన్నదానం

 

మోర్తాడ్‌, డిసెంబరు 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ పోలీసు స్టేసన్‌ ఎదురుగా గల కాలనీలోని శివాలయంలో కాలనీ వాసులు ఆదివారం మల్లన్న ఉత్సవాలను, అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర జరిగింది.

కాలనీ వాసులు వేదపండితులతో యజ్ఞం, శివ కళ్యాణం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా భక్తి శ్రద్దలతోనిర్వహించారు. కాలనీ వాసులు గంగాజలాలతో, మంగళహారతులతో అందంగా అలంకరించిన బోనాలు నెత్తినెత్తుకొని గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు కాలనీవాసులు అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేశారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *