Breaking News

ధర్మోరాలో అర్దరాత్రి మూడిళ్లలో చోరీ

 

– బంగారం, నగదు అపహరణ

మోర్తాడ్‌, డిసెంబరు 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ధర్మోరాగ్రామంలో శనివారం అర్ధరాత్రి మూడిళ్ళలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బంగారం, నగదు దోచుకెళ్ళినట్టు స్థానిక బాధితులు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం…. దర్మోరా గ్రామానికి చెందిన పడిగెల రాజగంగు, కుందెన లక్ష్మి ఇళ్లల్లో శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇళ్లల్లోకి చొరబడి బీరువాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు.

రాజగంగు ఇంటినుంచి రెండు తులాల బంగారం, అరతులం కమ్మలు, 20 వేల నగదు, పక్కనేగల లక్ష్మి ఇంటి నుంచి తులంనర బంగారం, 10 వేల నగదు దోచుకెళ్లినట్టు తెలిపారు. ఒకపక్క గ్రామంలో పోలీసుల ఆదేశాల మేరకు గస్తీదళాలు తిరుగుతున్నప్పటికి మరోపక్క తాళాలు పగులగొట్టి దొంగతనం జరగడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. స్థానిక సర్పంచ్‌ రాజేందర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ అశోక్‌రెడ్డి గ్రామాన్ని సందర్శించి దొంగతనం జరిగిన విషయం ఉన్నతాధికారులకు వివరించారు. దీంతో క్లూస్‌టీం విచ్చేసి వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *