Breaking News

పూడ్చివేసిన కాలువలను పునర్నిర్మించాలి

 

మోర్తాడ్‌, డిసెంబరు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలోగల విజయలక్ష్మి చెరువు (ఊరచెరువు), రాంసాగర్‌ చెరువు నీటితో నింపేందుకు వరద కాలువ ద్వారా,కాకతీయ కాలువ ద్వారా, గట్టుపొడిచిన వాగు, చౌట్‌పల్లి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు వచ్చేలా ఏర్పాటు చేసిన కాలువలను పాలెం గ్రామానికి చెందిన కొందరు రైతులు కబ్జాలకు గురిచేసి కాలువలను పూడ్చివేశారని, తిరిగి కబ్జాదారులను తొలగించి కాలువల పునర్నిర్మాణం చేయాలని తిమ్మాపూర్‌ గ్రామ రైతులు, సహకార సంఘ సభ్యులు సోమవారం తహసీల్‌ కార్యాలయం ముందు బైఠాయించారు.

పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం మోర్తాడ్‌ తహసీల్దార్‌ వెంకట్‌రావుకు అందజేశారు. చెరువులకు సాగునీరు వచ్చే కాలువలను పూడ్చివేయద్దని పాలెం గ్రామస్తులకు ఎన్నోసార్లు విన్నవించామని, వారు పెడచెవిన పెడుతున్నారని రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని కాలువల నిర్మాణాలను చేపట్టాలని, లేకుంటే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తహసీల్దార్‌కు విన్నవించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ పాలెం గ్రామస్తులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని, లేనియెడల ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు చేపట్టి కాలువల పునర్నిర్మాణానికి కృషి చేస్తామనిహామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *